(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం
ఏకదంతాయ*గణపతి నవరాత్రోత్సవాలు!*
ఇజ్జత్ నగర్ శేరిలింగంపల్లి 27 ఆగస్ట్. నేటి సత్యం. ప్రతినిధి
:ఆగస్టు 27. ఏకదంతాయ వినాయక బృందం. ఇజత్ నగర్ కాలనీ సిపిఐ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన భారీ గణపతి మండపం విగ్రహం..
శేర్లింగంపల్లి నియోజకవర్గం ఇజ్జత్ నగర్ లో. భారీ గణపతిని ఏర్పాటు చేసుకొని. నవరాత్రులు పూజలు ప్రతిరోజు జరుగుతూ గణపతి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని అందరికీ మంచి జరగాలని విద్యార్థులకు చదువులు రావాలని నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని అందరికీ ఆరోగ్యాలు బాగుండాలని కోరుకుంటారు
తెలంగాణ రాష్ట్రంలో వినాయక చవితి సంబరాలకు సన్నద్ధమవు తుంది, వినాయక చవితి వచ్చిందంటే చాలు ఊరు వాడంత సంబరాలే, తొమ్మిది రోజులపాటు గణేష్ మండపంలో ఊరు వాడ లో గణపతి బప్పా మోరియా అనే నినాదాల తో మారుమోగుతాయి,
వినాయక చవితిని పురస్క రించుకుని బుధవారం నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు గణపతి నవరాత్రోత్స వాలు ఘనంగా నిర్వహిస్తారు. హిందువులు జరుపుకునే పండగలలో వినాయక చవితి పండగకు విశిష్ట స్థానం ఉంది. పిల్లలు ఎంతో ఇష్టంగా జరుపుకునే పండగ. పెద్దలు పిల్లలుగా మారే పండగ. దేశ వ్యాప్తంగా వినాయక చవితి సందడి మొదలైంది. వినాయక పుట్టిన రోజైన బాద్రపద మాసం శుక్ల పక్షం చవితితిథి నుంచి 9 రోజుల పాటు గణపతిని పుజిస్తారు. ఇప్పటికే గల్లీ గల్లీలో గణపతి నవరాత్రి వేడుకల కోసం మండపా లను రెడీ చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో. టి.అజయ్. టి నితీష్.చక్రం.. అజ్జు.టి గణేష్. ఎం.అశోక్. భాస్కర్. సురేష్. చందు. నవీన్. బాలాజీ ఆది.నిశాంత్. నవదీప్. మణికంఠ. సుదర్శన్. టీ మణికంఠ. రాకేష్. టి.శశి. చింటూ. శివ. కిరణ్. తదితరులు ఉన్నారు
.