Neti Satyam
Newspaper Banner
Date of Publish : 28 August 2025, 8:44 am Editor : Admin

ప్రజా నిరసనపై కురిపించిన తూటాలు 25 సంవత్సరాలు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

*ఆరని నెత్తుటి మరకలకు 25 యేండ్లు*
*********************************
అవును!
బషీర్ బాగ్ నెత్తుటి మరకలు
ఇంకా ఆరలేదు
ఆరని ఆ.. నెత్తుటి మరకలకు
25 యేండ్లు

ప్రజల తిరుగుబాటు కైనా
హక్కుల సాధనకైనా
చరిత్రలో పోరాట స్ఫూర్తినిస్తూనే
ఆనాటి జలియన్ వాలా బాగ్ నెత్తుటి దారాల
ఆరని బషీర్ బాగ్ నెత్తుటి మరకలకు
25 యేండ్లు

పెంచిన విద్యుత్ చార్జీలు
ఉపసంహరించాలని
అసెంబ్లీ వైపు సాగిన
ప్రజా నిరసన పై
కురిపించిన తూటాలకు
నగరం నడిబొడ్డు నెత్తుటి ముద్దాయి
ఆరని బషీర్ బాగ్ నెత్తుటి మరకలకు
25 యేండ్లు

ప్రపంచ బ్యాంకు విధానాలకు
తలోగ్గిన ప్రజా కంటక పాలన
ప్రజా తిరుగుబాటు పై
ఉక్కు పాదం మోపితే
ఆరని బషీర్ బాగ్ నెత్తుటి మరకలకు
25 యేండ్లు

బరపి పిరంగులకు
పొగ బాంబులకు
ఇనుప ముళ్ళ కంచెలకు
టియార్ గ్యాస్ లకు
బెదరని వీరుల రక్తంతో తడిసిన
ఆరని బషీర్ బాగ్ నెత్తుటి మరకలకు
25 యేండ్లు

అశ్విక దళ గేటికెల కింద
రక్షక భటుల బూట్ల కింద
నలిగిన నిరసనకారుల
మాంసపు ముద్దల రక్తంతో
ఆరని బషీర్ బాగ్ నెత్తుటి మరకలకు
25 యేండ్లు

రామకృష్ణ
బాలస్వామి
విష్ణువర్ధన్ అనేక మంది పై
గురిపెట్టి కాల్చిన
స్టెన్ గన్ కాల్పులకు
చిందిన రక్తంతో
ఆరని బషీర్ బాగ్ నెత్తుటి మరకలకు
25 యేండ్లు

వేలాదిమంది నిరసన కారులు
శతగాత్రులైన
బిగించిన పిడికిలితో
పోరు జెండా పైకెత్తి
భావితరాలకు దిచ్చుకితో
ఆరని బషీర్ బాగ్ నెత్తుటి మరకలకు
25 యేండ్లు

పాలకులు అవలంబించే
ప్రజా వ్యతిరేక సంస్కరణల పై
ప్రజా సమీకరణ పోరాటాలకు
ఆనాటి రణరంగం ఇంకా పూర్తినిస్తూనే
ఆరని బషీర్ బాగ్ నెత్తుటి మరకలకు
25 యేండ్లు

అవును!
ఆరని ఆ.. బషీర్ బాగ్ నెత్తుటి మరకలకు
25 యేండ్లు

వీరత్వం పొందిన వీరులకు
ప్రాణాలొడ్డి ప్రతిఘటించిన
యోధులకు
రెడ్ సెల్యూట్!

(2000 ఆగస్టు 28 బషీర్ బాగ్ విద్యుత్ ఉద్యమానికి 25 సంవత్సరాల సందర్భంగా…)