Neti Satyam
Newspaper Banner
Date of Publish : 28 August 2025, 8:53 am Editor : Admin

21 మంచి 25 వరకు జాతీయ మహాసభలు చండి గాడ్ జరుగుతాయి కూనం నేని సాంబశివరావు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం ఆగస్టు 28

*ముఖ్దూం భవన్*

*కూనంనేని సాంబశివ రావు కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి,*

సిపిఐ 4 వ రాష్ట్ర మహా సభలు ఘనంగా ముగిశాయి

ఏకగ్రీవంగా మరొకసారి రాష్ట్ర కార్యదర్శిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది

21 నుంచి 25 వరకు జాతీయ మహాసభలు చండీగఢ్ లో జరుగుతాయి

దేశంలో బీజేపీ ప్రభుత్వం ఫాసిస్ట్ బాటలో పయనిస్తోంది

ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, బాధ్యత మరిచి నిర్లక్ష్యం వహిస్తోంది

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పకుండా, మరింత అభివృద్ధి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై పోరాటాలు చేయాలని నిర్ణయించాం

*కాళేశ్వరం పేరుతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారు*

*కాళేశ్వరాన్ని హైలెట్ చేస్తూ రాష్ట్రంలో ఇతర ప్రాజెక్ట్ లను నిర్లక్ష్యం వహించారు*

*రాష్ట్రంలో ఉన్న ఇతర ప్రాజెక్టులు విస్మరించి, కాళేశ్వరం ప్రధాన ఎజెండాగా వేల కోట్ల అప్పులు తెచ్చి మట్టిలో పోశారు*

ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు, రైతాంగ సమస్యలపై పోరాటాలు ఉదృతం చేస్తాం

వేలాది పేదలు గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. అధికారులు వారి గుడిసెలను నిర్ధాక్షిణ్యంగా తొలిగించి నిరాశ్రయులను చేయడం సరికాదు

పేదల ఇండ్లను కూల్చడంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి

*ఆర్టీసీని కాపాడుకోవడం కోసం నిరంతర పోరాటాలకు సిద్ధం అవుతాం*

*సజ్జనార్ ముఖ్యమంత్రినా..?మంత్రినా..? ఎండి నా..?*

*సజ్జనార్ పద్ధతి మార్చుకోవాలి*

*సజ్జనార్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఉండొచ్చు, అట్లాంటి భయానక వాతావరణం ఆర్టీసీ కార్మికుల పట్ల సృష్టిoచడం సరైంది కాదు*

*కార్మికుల పట్ల సజ్జనార్ పద్ధతి మార్చుకోక పోతే సజ్జనార్ పై ప్రత్యేక ఉద్యమాలు రూపొందించాల్సి వస్తుందని సజ్జనార్ కు గుర్తు చేస్తున్నాం*

*సజ్జనార్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు*

11 నుంచి 17 వరకు తెలంగాణ వారోత్సవాలు జరుపుతాం

డిసెంబర్ 26 న కమ్యూనిస్ట్ పార్టీ వందేళ్ల సంబురాల సందర్భంగా ఖమ్మoలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం

తెలంగాణ సాయుధ పోరాట త్యాగాల్ని, ప్రభుత్వం గుర్తించాలి. సాయుధ వారోత్సవాలను జరిపేందుకు ప్రభుత్వం ముందుకు రావాలి

30న సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ రవీంద్రభారతిలో ఉంటుంది

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించాం

స్థానిక సంస్థల ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తాం

కాంగ్రెస్ సీపీఎం పార్టీలు కలిసొచ్చిన చోట కలిసి పోటీ చేస్తాం

పొత్తు లేని చోట ఒంటరిగా బరిలో నిలుస్తాం