Neti Satyam
Newspaper Banner
Date of Publish : 29 August 2025, 1:25 pm Editor : Admin

విప్లవ వీరునికి సంస్మరణ సభ




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం

విప్లవ వీరునికి సంస్మరణ సభ

నేటి సత్యం. హైదరాబాద్. ఆగస్టు 29

సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంట్‌ మాజీ సభ్యులు సురవరం సుధాకర్‌ రెడ్డి సంస్మరణ సభ తేది: 30.08.2025. రేపు శనివారం రోజున ఉదయం 11.00 గంటలకు హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో సిపిఐ తెలంగాణ స్టేట్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సంస్మరణ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, సిపిఎం కేంద్ర పోలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎన్‌వి రమణ, బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు, రాష్ట్ర మంత్రులు, వివిధ రాజకీయ పార్టీల, వామపక్ష పార్టీల నాయకులు, మేధావులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారని సాంబశివరావు తెలిపారు. రాష్ట్ర వ్యాపితంగా ఉన్న పార్టీ శ్రేణులు, శ్రేయోభిలాషులు పాల్గొనాలని కూనంనేని విజ్ఞప్తి చేశారు.