(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఆకాశంలో వింత
గణపతి రూపం లో మేఘాలు
మహబూబునగర్ ప్రతినిధి/ రవిశంకర్ ఆగస్టు 31 (ప్రజా ప్రతిభ)
ఆకాశంలో అద్భుతం కనిపించింది వినాయక చవితి పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు ఘనంగా వినాయక ఉత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో ఆకాశంలో వినాయకుడు మేఘాల రూపంలో దర్శనం ఇచ్చాడు. ఈ వింతను అద్భుతాన్ని ప్రజలు వీక్షించి పరవశించిపోయారు. వినాయకుడు దేశ ప్రజలకు మేఘాల రూపంలో కనిపించడం పట్ల ప్రజలు వినాయకుని కళ్లారా చూసి దర్శనం చేసుకున్నారు. దైవభక్తిని ప్రజలు చాటుకున్నారు. గత కొన్ని రోజుల నుంచి దేశభక్తంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఎక్కడ చూసినా వాగులు వంకలు ఏరులై పారుతున్న సందర్భంలో రైతుల కళ్ళలో ఆనందం అవధులు లేకుండా పోతున్న ఈ సందర్భంలో వినాయక చవితి పండుగ ముందు భారీ వర్షాలు కురవడంతో వినాయక నిమజ్జనానికి ఎక్కడ చూసినా చెరువులు. కుంటలు. వాగులు. ప్రాజెక్టులలో జలకళ సంతరించుకున్నది. ఈ సందర్భంలో ఈ వింత ఆకాశంలో దేవుడు రూపంలో మేఘాలు ప్రజలకు ప్రత్యక్షమయ్యాయి. ఈ అద్భుత ఘటన పట్ల దేవుడు ప్రజల్లో ఉన్నాడని స్పష్టంగా బహిర్గతమైంది. దేవుని నమ్మని నాస్తికులకు ఈ దృశ్యం చెంపపెట్టు లాగా కనిపించింది.