నేటి సత్యం చేవెళ్ల సెప్టెంబర్ 1 
న్యాలాట గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 240 లో 7 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇండ్లు లేని నిరుపేదలకు పంచాలి
సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కే రామస్వామి
భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో న్యాలట గ్రామ రెవెన్యూ పరిధిలోని 240 సర్వే నెంబర్లు గల 7 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇండ్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఈరోజు చేవెళ్లలోని ఎమ్మార్వో గారికి మెమోరండం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కే రామస్వామి మాట్లాడుతూ రామన్నగూడెం న్యలాట సింగప్పగూడెం గ్రామాలలో చాలామంది నిరుపేదలకు ఇండ్లు లేవు 240 సర్వే నెంబర్ లో ఏడు ఎకరాల ప్రభుత్వ భూమిని గతంలో కొంతమంది నిరుపేదలకు ప్లాట్లు చేసి ఇచ్చారు కానీ కొంతమంది భూ బకాసురులు ఆ భూమిని కబ్జా చేశారు కొంతమంది రాజకీయ నాయకులు ప్లాట్లను క్రయవిక్రయాలు చేశారు కాబట్టి ప్రభుత్వము అధికారులు చొరవ తీసుకొని కబ్జాకు గురి అయిన ప్లాట్లను ఆ గ్రామాలలో ఉండే నిరుపేదల అందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ కార్యదర్శి ఎం సత్తిరెడ్డి ఇన్సాబ్ జిల్లా అధ్యక్షుడు ఎండి మక్బుల్ NFIW జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్ల మంజుల గీతా పనివాళ్ల సంఘం మండల కార్యదర్శి కృష్ణ గౌడ్ రామన్నగూడెం గ్రామ శాఖ కార్యదర్శి పాపయ్య ఏఐటియుసి మండల అధ్యక్షుడు శివ నాన్చేరి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు