Neti Satyam
Newspaper Banner
Date of Publish : 02 September 2025, 11:55 am Editor : Admin

కాంగ్రెస్. బి ఆర్ ఎస్. పార్టీలపై ఎంపీ డీకే అరుణ సెటైర్లు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

*కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై ఎంపీ డీకే అరుణ సెటైర్లు*

మహబూబ్ నగర్, సెప్టెంబరు 2 : కాళేశ్వరం అవినీతిని బయటకు తీయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని తెలంగాణ బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. ఆ పార్టీ వ్యవహారం చూస్తుంటే.. అవినీతికి పాల్పడిన వాళ్లను కాపడుతున్నట్లే ఉందన్నారు. మహబూబ్ నగర్ బీజేపీ జిల్లా కార్యాలయంలో అరుణ మీడియాతో మాట్లాడారు ‘కాళేశ్వరం విషయంలో మేము ముందే సీబీఐ ఎంక్వయిరీ అంటే ఉలకలేదు, పలకలేదు. మీరు వేసిన కమిషన్ నివేదికలో ఏం తెల్చారు.. ఎవరిని దోషులుగా చూపారో ఎందుకు బయట పెట్టలేదు.? అంతన్నారు, ఇంతన్నారు.. చేసేదేమి లేక సీబీఐ ఎంక్వయిరీ అంటున్నారు. ఇదంతా బిఆర్ఎస్ కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందం లా కనిపిస్తోంది. దొంగలు దొంగలు కలిసి గుట్టలు పంచుకున్నట్లు ఉన్నది.’ అంటూ అరుణ రేవంత్ సర్కారుని ఎద్దేవా చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని స్వయంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితనే ఒప్పుకుంటుందని చెప్పిన డీకే అరుణ.. ‘ డైలాగ్స్ వద్దు.. దోషులు మీరే. కానీ.. కేసీఆర్ కు సంబంధం లేదంట.. ఇదెక్కడి చోద్యం. ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు ఏలింది వాళ్ళ కుటుంబమే కదా. బిఆర్ఎస్ లో ఉన్న కేసీఆర్ ఫ్యామిలీ మొత్తానికి కాళేశ్వరం అవినీతిలో సంబంధం ఉన్నది’ ఇది ఎవ్వరు కాదనలేని నిజం అంటూ అరుణ వ్యాఖ్యలు చేశారు..