Neti Satyam
Newspaper Banner
Date of Publish : 02 September 2025, 12:29 pm Editor : Admin

తెలంగాణలో ఇంటింటికి జనసేన!!




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం

*తెలంగాణలో ఇంటింటికి జనసేన..!*

*-అవినీతి లేని సమాజమే లక్ష్యంగా అడుగులు*

*-స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నాహాలు*

*-పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలి*

*-పాలకుర్తి బిసీ హాస్టల్ లో ఘనంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

*-మేడిద ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు దోమ తెరలు పంపిణీ*

* *పాలకుర్తి/ సెప్టెంబర్ 02/ జర్నలిస్టు నేటి సత్యం ప్రతినిధి:*

జనసేన పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు మంగళవారం పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో జనసేన పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ నియోజకవర్గ ముఖ్య నాయకులు మేడిద ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం పాలకుర్తి మండల బిసి బాలుర హాస్టల్ లో పిల్లలకి దోమతెరలు అందించారు. అనంతరం పిల్లలతో కలిసి కేక్ కటింగ్ చేసి జనసేనానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో జనసేన పార్టీని కూడా తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చేలా ఇంటింటికి జనసేన పార్టీ నినాదాలను తీసుకెళ్లేలా కార్యకర్తలు అభిమానులు కృషి చేయాలని కోరారు.
అవినీతి లేని సమాజమే లక్ష్యంగా జనసేనాని ముందుకు అడుగులు వేస్తోందని తెలిపారు.
పార్టీ బలోపేతానికి సమిష్టిగా కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జనసైనికులు ఆకుల సైదులు, మాడరాజు అశోక్, బండి ప్రశాంత్, భూక్య బాలునాయక్, కళ్యాణ్,పూజారి సాయికిరణ్, మారోజు సాయి, వడ్లకొండ శ్రావణ్, సోమ సాయి, గుండె మనోజ్, మహేష్ తదుపరిలు పాల్గొన్నారు.