Neti Satyam
Newspaper Banner
Date of Publish : 02 September 2025, 2:07 pm Editor : Admin

బిజెపి ది బస్మాసుర హస్తం దూరం ఉంటేనే మంచిది సిపిఐ జాతీయ నాయకులు కామ్రేడ్ కే నారాయణ




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం

బిజెపిది బస్మాసుర హస్తం

బిజెపికి దూరంగా ఉంటేనే మంచిది

ప్రాంతీయ పార్టీలకు సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే. నారాయణ హెచ్చరిక

నేటి సత్యం హైదరాబాద్ సెప్టెంబర్ 2

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ ప్రాంతీయ పార్టీలకు అభయహస్తం కాదని, బస్మాసుర హస్తమని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే. నారాయణ విమర్శించారు. ఈ మేరకు ఆయన వీడియో సందేశం విడుదల చేశారు.

తెలంగాణలో టిఆర్ఎస్ ఉదాహరణగా తీసుకుంటే, బీజేపీ దగ్గర కావడం వల్లే ఆ పార్టీ లో చీలికలు వచ్చాయని నారాయణ గారు వ్యాఖ్యానించారు. కవిత సస్పెన్షన్, పార్టీ విభజనకు బీజేపీనే కారణమని ఆరోపించారు.

అన్నాడిఎంకె (తమిళనాడు), శివసేన – ఎన్‌సిపి (మహారాష్ట్ర) పార్టీల విషయంలో కూడా బీజేపీ ఇదే తరహా ధోరణి ప్రదర్శించిందని గుర్తు చేశారు. బీజేపీ దగ్గరైన ప్రతీ పార్టీ చివరికి కనుమరుగైపోతుందని ఆయన పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనకు కూడా ఇదే పరిస్థితి ఎదురుకానుందని ఆయన జోస్యం చెప్పారు. బీజేపీ భస్మాసుర హస్తం చంద్రబాబుతో సహా అందరికీ వర్తిస్తుందని నారాయణ గారు హెచ్చరించారు.