బిఆర్ఎస్ భవిష్యత్తు ఏంటి??
బీఆర్‌ఎస్ భవితవ్యం ఏమిటి -ఎ. కృష్ణారావు ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి భారతదేశంలో ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్తు ఉన్నదా? తెలంగాణలో ఒకప్పుడు ఉజ్వలమైన పాత్రను పోషించిన భారత రాష్ట్ర సమితి దుస్థితి చూస్తుంటే ఈ అనుమానం రాకమానదు. బీఆర్ఎస్ ఎదుర్కొంటున్న పరిస్థితి అన్ని ప్రాంతీయ పార్టీలకూ వస్తుందని చెప్పలేము కాని బీఆర్ఎస్ దుస్థితి నుంచి మాత్రం ప్రాంతీయ పార్టీలు, వాటి నేతలు ఎలా వ్యవహరించకూడదో తెలుసుకునే అవకాశం ఉన్నది, తెలుసుకోవాలి కూడా. గత లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా...