(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం
7,11,116/- రూపాయలు పలికిన గణనాథుడి లడ్డు
నేటి సత్యం కొండాపూర్ సెప్టెంబర్ 3
శేరిలింగంపల్లి కొండాపూర్ డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీ బి బ్లాక్ లో థర్డ్ స్ట్రీట్ లో ప్రశాంత్ ఆధ్వర్యంలో ఏకదంతా యూత్ కమిటీ సభ్యులచే నిర్వహించిన లడ్డు వేలం పాటలో 21 కిలోల గణేష్ లడ్డూ భీమ్ శెట్టి శివ ప్రణీత్ 7,11,116/- రూపాయలకు సొంతం చేసుకున్నాడు అలాగే 5 కిలోల లడ్డు జోషి శ్రీకాంత్ 3,11,116/- రూపాయలకు సొంతం చేసుకున్నారు . ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రీరామ్ నగర్ కాలనీ లోనే మొట్టమొదటిసారి గా నిర్వహించిన ఈ విఘ్నేశ్వరుని లడ్డు వేలం పాటలో కానీ విని ఎరుగని రీతిలో లడ్డు వేలం పాట జరగటం విశేషం అని అన్నారు. ఆ గణనాథుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు సుఖసంపదల్లో సంతోషంగా ఉండాలని ఆ గణనాథుని ప్రార్థించినట్లు ఆ కమిటీ సభ్యులు తెలిపారు లడ్డు వేలంపాటలో గెలుచుకున్న భక్తులకు ఆ భగవంతుడు ఎప్పుడూ అండగా ఉంటూ అన్నిట్లో విజయం సాధిస్తూ ముందుకు రాణించాలని ప్రార్థించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు