Neti Satyam
Newspaper Banner
Date of Publish : 05 September 2025, 8:45 am Editor : Admin

చదువుల తల్లిని గౌరవించుకుందాం!




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 5

*చదువుల తల్లికి సన్మానాలు -గాధరి:పెద్దకొత్తపల్లి/నేటిసత్యం*,
ముష్టిపల్లి గ్రామీణ పేద విద్యార్థుని, విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే శైలజా రెడ్డి చదువుల తల్లికి జిల్లాఉత్తమ ఉపాధ్యాయురాలుగా సన్మానాలు అందుకోవడం అభినందనీయమని రచయిత, గాయకుడు ముష్టిపల్లి గాదరి చంద్రశేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని ముష్టిపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ టీచర్ శైలజ రెడ్డి, తోపాటు పెద్ద కొత్తపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ సత్య శ్రీ, పెద్ద కార్పాముల జిల్లా పరిషత్ హై స్కూల్ నాగపూర్ చంద్రశేఖర్, గాంధీనగర్ ప్రాథమిక పాఠశాల సాయి ప్రకాష్ రెడ్డి, వెన్నచర్ల పాఠశాల నందకిషోర్ ఉపాధ్యాయులు విద్యారంగంలో అంకితభావతో సేవలందించినందుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలుగా ఎన్నికై రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్స్ లభించడం మండలానికి గౌరవం దక్కిందని ముష్టిపల్లి గాదరి చంద్రశేఖర్ అన్నారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్స్ అందుకున్న ఉపాధ్యాయులకు గాదారి చంద్రశేఖర్ శుభాకాంక్షలు తెలిపారు.