(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేడే మహబూబ్ నగర్ లో వినాయక నిమజ్జనం
భద్రతా, బందోబస్తు ట్రాఫిక్ మళ్లింపు ఏర్పాట్లు పూర్తి
రూట్ మ్యాపు విడుదల చేసిన జిల్లా ఎస్పీ డి.జానకి
మహబూబునగర్ ప్రతినిధి/RK సెప్టెంబర్5( నేటి సత్యం
)
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రేపు శుక్రవారం నిర్వహిస్తున్న గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా శాంతియుతంగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ టీ జానకి ఇప్పటికే అన్ని ఏర్పాటను పూర్తి చేస్తూ రోడ్ మ్యాప్ ను ప్రకటించారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీసు విభాగం ఆధ్వర్యంలో నిమజ్జనం శాంతియుతంగా, ఎటువంటి అంతరాయం లేకుండా జరిగే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు.నిమజ్జనం కోసం వచ్చిన భక్తులు సౌకర్యంగా విగ్రహాలను తరలించేందుకు ప్రత్యేక రూట్లను కేటాయించామని తెలిపారు.ట్రాఫిక్ రద్దీని నివారించడానికి క్రింది మళ్లింపు (డైవర్షన్) పాయింట్లు అమలులోకి .వస్తాయి అని ఎస్పీ వివరించారు.ట్రాఫిక్ మళ్లింపు పాయింట్లు ఉన్నాయని అదేవిధంగా
మొదటి మళ్లింపు పాయింట్ (ఫైర్ స్టేషన్ దగ్గర) ఫైర్ స్టేషన్ నుండి కొత్త చెరువు. ఎక్స్ రోడ్ – బ్రిడ్జి – పోట్టి శ్రీ రాములు చౌరస్తా – జిల్లా కోర్టు – తెలంగాణ చౌరస్తా – అంబేద్కర్ చౌరస్తా వరకు.మళ్లింపు పాయింట్ (పోట్టి శ్రీ రాములు చౌరస్తా) పోట్టి శ్రీ రాములు చౌరస్తా జిల్లా కోర్టు – తెలంగాణ చౌరస్తా – అంబేద్కర్ చౌరస్తా వరకు.
మళ్లింపు పాయింట్ (పాత బస్టాండ్ చౌరస్తా) పాత బస్టాండ్ – నవోదయ ఆసుపత్రి – తెలంగాణ చౌరస్తా వరకు.మళ్లింపు పాయింట్ (అంబేద్కర్ చౌరస్తా) జడ్చర్ల నుండి కోస్గి రోడ్డు మరియు కోయిలకొండ రోడ్డు వైపు వచ్చే వాహనాల మళ్లింపు పాయింట్ అంబేద్కర్ చౌరస్తా వద్ద. అంబేద్కర్ చౌరస్తా – తెలంగాణ చౌరస్తా – జిల్లా కోర్టు – పోట్టి శ్రీ రాములు ఎక్స్ రోడ్ – కోత చెరువు ఎక్స్ రోడ్ – ఫైర్ స్టేషన్ – కోయిలకొండ ఎక్స్ రోడ్ వరకు.
మళ్లింపు పాయింట్ (రాజీవ్ గాంధీ చౌరస్తా) రాజీవ్ గాంధీ నుండి బీఎస్ఎన్‌ఎల్ వైపు జడ్చర్ల కోయిలకొండ ఎక్స్ రోడ్ వైపు.విగ్రహాల తరలింపు మార్గాలు వినాయక మండపాల నుండి విగ్రహాలను తీసుకువచ్చే వాహనాలు నిర్దిష్ట రూట్ల ద్వారా మాత్రమే నిమజ్జనం స్థలానికి తరలించాలని ఆమె పిలుపునిచ్చారు. అదేవిధంగావిగ్రహాలను తరలించే సమయంలో విద్యుత్ వైర్లు, ట్రాఫిక్ రద్దీ, చిన్నారుల భద్రత వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని
సూచించారు.నిమజ్జనం కోసం భారీ వాహనాలు, ట్రాక్టర్లు, డీజే వాహనాలు ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణలోనే కదలాడాలి. జిల్లా
ఎస్పీ జానకి ప్రజలను కోరుతూ
పోలీసులు ఇచ్చిన సూచనలు పాటించాలని, నిమజ్జనం సమయంలో శాంతి భద్రతలు కాపాడడంలో సహకరించాలని,వాహనదారులు ట్రాఫిక్ మళ్లింపుల మార్గాలను ఉపయోగించి ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు.జిల్లా ప్రజల సహకారంతో వినాయక నిమజ్జనం శాంతియుతంగా, విజయవంతంగా పూర్తవుతుందని ఆమె ఆశించారు.