Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeUncategorizedమట్టిలో మాణిక్యం మా.. సురవరం -- కడవరకు కమ్యూనిస్టు గానే కొనసాగుతo!!

మట్టిలో మాణిక్యం మా.. సురవరం — కడవరకు కమ్యూనిస్టు గానే కొనసాగుతo!!

“మట్టిలో మాణిక్యం మా సురవరం ”

ఏ ఒక్క రోజు కమ్యూనిస్టు అని ఒక పదం పలకని వాళ్ళు , ఏనాడు ఎర్రజెండా ఎత్తనివాళ్లు , ఏనాడు కమ్యూనిజం బాటలో నడవని వాళ్ళు మీరు లేరని తెలిసి ఇకమీదట మీరు రాలేరు అని తెలిసిన మరుక్షణం శోకసంద్రంలో మునిగిపోయారు. సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా మీ యొక్క పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సంతాపం తెలుపుతూ రాస్తున్న కావ్యాలు ఎన్నో నాకు ఊహ తెలిసిన కానుంచి చాలామంది నాయకులకు సంతాపం తెలిపారు కానీ వారి దగ్గర డబ్బు , హోదా, గర్వం, పలుకుబడి అన్ని ఉన్నవాళ్లకు తేలుపారు కానీ మీరు వాటిని మీ దరిదాపుల్లోకి రానీయకుండా ఒక సర్వసాధారణమైన జీవితం గడిపి ఇన్ని వేల మంది హృదయాలను గెలుచుకున్న మీరు ఎంతటి మహానుభావులు వాళ్లకి మీరు ఏమీ ఇచ్చారని మీపై ఇంతటి ప్రేమ అభిమానం ఈ ప్రపంచంలో చాలామంది పుడతారు గిడతారు కానీ మీలాంటి ఆణిముత్యాలు చాలా అరుదు అందులో కమ్యూనిస్టు పార్టీ లో పనిచేయడం మాలాంటి వేలమంది కార్యకర్తలకి పెద్దదిక్కుగా నిలవడం మాకు ఎంతో గర్వంగా ఉంది మీ పుట్టుక ఒక సాధారణమైనదే కావచ్చు కానీ మీ మరణ వార్త మాత్రం యావత్ ప్రపంచాన్ని కలిచి వేసింది ఇంతటి కీర్తి కేవలం కోటి మందిలో ఒకరికి దక్కుతుంది అది ఒక గొప్ప మనసున్న సురవరం సుధాకర్ రెడ్డికే సాధ్యం అవుతుంది .
మీరు ఒక అగ్రకుల నాయకులు మీ మేధాశక్తికి మీరు అనుకుంటే ఆస్తులు పదవులు అన్ని మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి కానీ వాటన్నింటికీ విరుద్ధంగా బడుగు బలహీన వర్గాల కోసం పేద ప్రజల హక్కుల కోసం అదే అగ్రకుల నాయకులతో పోరాటం సాగించిన గొప్ప నాయకులు మీరు మట్టిలోంచి మాణిక్యం పుట్టినట్లు వలస జిల్లా కరువు జిల్లాలో పుట్టి కూడు గూడు గుడ్డ లేని పేద వాళ్ళ కోసం గలమెత్తి కొట్లాడిన గొప్ప మేధాశక్తి గల నాయకులు మీరు పాలమూరు జిల్లా అంటేనే వలసల జిల్లా పేరుగాంచిన కరువు జిల్లానే కాదు దేశ రాజకీయాలను సైతం శాసించదగ్గ నాయకులు పుడతారని నిరూపించిన కమ్యూనిస్టు ముద్దుబిడ్డ మీరు కమ్యూనిస్టు కార్యకర్త నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు. ఈ దేశంలో పుట్టిన చాలామంది నాయకులంతా ఈ దేశం మనకు ఏమిచ్చింది అని ఎదురుచూసిన వల్లే కానీ ఒక కమ్యూనిస్టుగా మీరు మాత్రం ఈ దేశానికి , దేశ ప్రజలకి మనము ఎంత సేవ చేసాము అని ఆలోచించిన గొప్ప నాయకులు మీరు
నేను మొదటిసారి మిమ్మల్ని ప్రత్యేకంగా 2022వ సంవత్సరంలో ఎం బాల నరసింహ గారు ఫయాజ్ గారు నేను మీయొక్క స్వగ్రామం కంచుపాడు లో కలిసి మాట్లాడి భోజనం చేసే అదృష్టం మాకు కలిగింది ఆరోజు నాకు ఏదో తెలియని సంతోషం జాతీయ అగ్రనాయకునితో కలిసి భోజనం చేయడం అన్నది ఆరోజు మీతో ఒక ఫోటో అడుగుదాము అనుకుంటే లోపల ఏదో భయం ఏమి అనుకుంటారో అని రెండవసారి 2025 ఆగస్టు 4వ తేదీన మీ ఆరోగ్యం బాగాలేదని తెలిసి గచ్చిబౌలి కేర్ హాస్పిటల్ లో ఏం బాల నరసింహ గారు నూతన జిల్లా కార్యదర్శి ఫయాజ్ గారు నేను కలిసి ఒక గంట పైన మీతో మాట్లాడినప్పుడు నాకు అనిపించింది కమ్యూనిస్టు పార్టీ శతజయంతి ప్రారంభోత్సవ వేడుకలు నల్గొండ జిల్లాలో మీ ఉపన్యాసంతో ప్రారంభించుకున్నాము అదేవిధంగా సిపిఐ రాష్ట్ర కార్యాలయం పునః ప్రారంభం మీ చేతుల మీద గానే జరిగింది అట్లాగే నాగర్ కర్నూల్ జిల్లా నూతన జిల్లా పార్టీ కార్యాలయం , ఖమ్మం జిల్లాలో జరిగే శతజయంతి ముగింపు మహాసభ మీ ఉపన్యాసం తోనే దిగ్విజయంగా పూర్తి చేసుకుంటామని అనుకున్నా కానీ ఆశలు నిరాశలైనవి ఆగస్టు 22వ తేదీన హైదరాబాదులో తెలంగాణ నాల్గవ రాష్ట్ర మహాసభలు చివరి రోజు ముగించుకొని వచ్చిన ప్రతినిధులు అందరూ ఎవరి ఊర్లకు వాళ్ళు ప్రయాణమయ్యారు అంతలోనే ఒక విషాదకర వార్త సురవరం సుధాకర్ రెడ్డి గారు మరణించారని రాష్ట్ర మహాసభల ఆనందమంతా ఒక్క క్షణంలో కనుమరుగై అయిపోయింది ఎవరు మొహంలో చూసిన ఏదో తెలియని బాధ కమ్యూనిస్టు పార్టీ ఒక మంచి నాయకున్ని కోల్పోయిందని కమ్యూనిస్టు పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇది ఎన్నటికి తీరని ఒక లోటుగా మిగిలిపోతుంది .

ఆగస్టు 30న రవీంద్ర భారతి లో మీ యొక్క సంస్మరణ సభ ఏర్పాటు చేసుకుంటే ఆ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వివిధ రాజకీయ పార్టీల నాయకులు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ గారు ప్రొఫెసర్లు మేధావులు కవులు కళాకారులు మీ గురించి మాట్లాడుతూ గాంధీ మెడికల్ కాలేజీకి మీ దేహాన్ని అప్పగిస్తే అక్కడ డాక్టర్లుగా చదువుకుంటున్న విద్యార్థులు మీయొక్క దేహంతో పరీక్షలు చేసి 250 మంది డాక్టర్లుగా పట్టా పొంది వాళ్లు బయట ప్రపంచానికి వచ్చి అనేక వేల మంది జబ్బులను నయం చేస్తారు అని వింటుంటే ఎంత ఆనందం కలిగిందో మీ దేహం కూడా 250 మంది డాక్టర్లకు ఉపాధి కల్పించింది అంటే అంతటి గొప్ప మనసున్న నాయకులు అది మా కమ్యూనిస్టు అగ్ర నాయకుడు అని ఆనందపడాలా మీరు లేరని బాధపడాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం

బండారు దత్తాత్రేయ గారు మాట్లాడుతూ సురవరం సుధాకర్ రెడ్డి గారు విషయ పరిజ్ఞానంతో పాటు పట్టుదల ఉన్న వ్యక్తి అని ఆయన అన్నారు నేటి రాజకీయాలు వ్యాపారాలు కమిషన్లు సంపదలుగా మారిన రోజుల్లో తన ఆస్తులు సైతం పేదలకు పంచిపెట్టి ఒక నిజాయితీ నైతిక విలువలు గల నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి అని ఆయన అన్నారు.

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ గారు మాట్లాడుతూ నా చిన్నతనంలో మా నాన్నగారు కూడా కమ్యూనిస్టు నాయకుడే అని ఆయన గుర్తుకు చేశారు ఆయన కూడా అనేక పోరాటలలో ఉద్యమాలలొ పాల్గొన్నారు అన్నారు సురవరం సుధాకర్ రెడ్డి గారితో నేను చాలా సందర్భాలలో కలిసిన రోజులు ఉన్నాయ ని ఆయన ఎటువంటి క్లిష్ట పరిస్థితిని అయినా తన మేధాశక్తితో సులువుగా పరిష్కరించే గొప్ప విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి అని ఆయన అన్నారు కమ్యూనిస్టు పోరాటాలు బలపడాలంటే కమ్యూనిస్టులంతా ఐక్యమై ఉండాలని అప్పుడే ప్రజల గొంతుకగా వారి సమస్యలను ప్రభుత్వాలకు వినిపిస్తారని అన్నారు.

జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా గారు మీ గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురై కన్నీరు కారిస్తే ఒక క్షణం హాల్ అంతా నిశ్శబ్దం అయ్యింది

జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ గారు (ఫైర్ బ్రాండ్) ఆయన మాటలు మృదువుగా సున్నితంగా మాట్లాడడం నేనెప్పుడూ చూడలే ఆయన ఉపన్యాసాలే ఒక స్టైల్ లో ఉంటాయి అంతటి లీడర్ మీ గురించి ఉపన్యాసం ఇస్తూ చిన్నతనం నుంచి నన్ను నా ఆవేశాన్ని భరిస్తూ నా వేలు పట్టుకొని నడిపించిన నాయకుడు సురవరం గారు అని నారాయణ గారు అంటుంటే ఆయన గొంతులో ఏదో తెలియని చిన్న వణుకు కంటి నుండి కన్నీటి ధార ఆ సన్నివేశం చూసి చాలామంది కళ్ళల్లో కన్నీళ్లు చమార్చాయి.

విజయలక్ష్మి మేడం గారు మాట్లాడుతూ కంచుపాడు లో పాఠశాల భవనం మూడు గదులు శిథిలావస్థలో ఉన్నాయి వాటి స్థానంలో కొత్త గదులను మంజూరు చేయాలని ఆమె కోరారు అదేవిధంగా కంచుపాడు తో పాటు సమీప గ్రామాలకు బస్సు సౌకర్యం లేకుండా పోయింది దానిని మళ్లీ ప్రారంభించి బస్సులు నడపాలని ఆమె కోరారు. అదేవిధంగా మా సార్ కు వంశపారపర్యంగా వచ్చిన నాలుగున్నర ఎకరాల భూమిలో రేపటి భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఒక జూనియర్ కాలేజీ అయినా డిగ్రీ కాలేజీ అయినా లేకుంటే నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా శిక్షణ తరగతుల భవనాన్ని (స్కిల్స్ డెవలప్మెంట్) నిర్మించేందుకు ప్రభుత్వం నుండి భవనాన్ని నిర్మిస్తే ఆ నాలుగున్నర ఎకరాల భూమిని విరాళంగా ఇస్తామని హామీ ఇచ్చారు . నేటితరం ఎవరు ఏమైపోతే మాకేంటి అనుకునే రోజులలో నిరంతరం ప్రజలు బాగుండాలి విద్యార్థులు యువకులు చదువుకొని ఉద్యోగాలు పొందుతేనే రేపటి సమాజం బాగుంటుంది అని ఆలోచించే గొప్ప మనసున్న నాయకురాలు విజయలక్ష్మి మేడంగారు
మీలాంటి గొప్ప మనసున్న నాయకునికి అంతే గొప్ప మనసున్న విజయలక్ష్మి మేడంగారు మీ ఇద్దరి ప్రేమ కలబోసుకుని జన్మించిన నిఖిల్ అన్న , కపిల్ అన్న ఇద్దరు కూడా మీ అంత విశాలమైన హృదయం కలవారు , నేటితరం పిల్లలు మాకు ఏమి ఇచ్చారు ఎంత సంపాదించారు అని తల్లిదండ్రులను పీడిస్తున్న రోజుల్లో మీకు వచ్చిన వంశాపారపర్యంగా వచ్చిన భూమి నంత దారా దత్తం చేసిన గొప్ప మనసుతో ఒప్పుకున్న మేడమ్ గారికి గాని అన్నవాళ్ళకి గాని మా రెడ్ సెల్యూట్స్
ఆ కాస్త ఉన్న నాలుగున్నర ఎకరాల భూమిని కూడా భవిష్యత్తు తరాల యువతకు ఉపయోగపడే విధంగా విరాళం ఇచ్చారు ఎంతటి గొప్ప మనసు ఉంటే మీరు ఇంతటి త్యాగానికి సిద్ధపడాలి కమ్యూనిస్టులుగా మేము ఏమి తీర్చుకోగలం మీ రుణాన్ని.
నాకు ఎప్పటినుంచో ఒక కోరిక ఉండేది మీ చేయి నా భుజం పైన వేయించుకొని మీతో ఒక ఫోటో దిగి దాన్ని ఒక మంచి ఫ్రేమ్ కట్టించి మా ఇంటి గుమ్మం ఎదురుగా పెట్టుకోవాలి అని ఎవరైనా ఆ ఫోటో చూసి ఎవరిని అడిగిన వాళ్లకి చాలా గర్వంగా మా బాస్ , మా లీడర్ , మా భవిష్యత్తుకు బాట చూపిన గొప్ప నాయకుడు అని చెప్పాలి అని అనుకున్నాను కానీ అది కలగానే మిగిలిపోతుందని నేను ఎప్పుడూ అనుకోలే.

(మాటిస్తున్నాం సార్ రేపు మా భవిష్యత్తు ఏమైనా కావచ్చు కానీ కడవరకు కమ్యూనిస్టులుగానే ఉంటామని)
మి
వీరాభిమాని ….
కే.శివ కృష్ణ
నాగర్ కర్నూల్ జిల్లా

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments