Neti Satyam
Newspaper Banner
Date of Publish : 08 September 2025, 3:01 pm Editor : Admin

కాలేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ విషం చిమ్మింది కేటీఆర్




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

_ నేటి సత్యం ఆగస్టు 8

*హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ విషం చిమ్మింది.. ఎన్నికలకు ముందు విషప్రచారం చేసి, ఎన్నికల తరువాత కూడా కాళేశ్వరంపై కక్ష కట్టి సీబీఐ విచారణకు ఆదేశించారు.. వారం తిరగక ముందే మల్లన్నసాగర్ నుంచి నీళ్లు తెస్తున్నామని ప్రకటిస్తున్నారు.. తల దగ్గర చేయాల్సిన శంకుస్థాపనను తోక దగ్గర చేస్తున్నారు.. మల్లన్నసాగర్ వద్ద శంకుస్థాపన చేసేందుకు మొహం చెల్లక, గండిపేట వద్ద డ్రామా చేస్తున్నారు.. కాళేశ్వరం కూలేశ్వరం అని అన్న వారే ఈరోజు అక్కడి నుంచి హైదరాబాద్‌కు మంచి నీళ్లు తెస్తున్నారు: కేటీఆర్*_

_*కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేసినందుకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి.. కాళేశ్వరం ద్వారా 240 టీఎంసీల నీటి వినియోగం జరిగింది.. సీబీఐని రాహుల్ గాంధీ తప్పుబడతారు.. అదే సీబీఐకి కాళేశ్వరం విచారణను రేవంత్ అప్పగించారు: కేటీఆర్*_