జీఎస్టీ తగ్గింపు ఫలాలు దక్కేది ఎవరికి డి వెంకటేశ్వరరావు
నేటి సత్యం ఆగస్టు 8 జీఎస్టీ తగ్గింపు ఫలాలు దక్కేదెవరికి? -డి. వెంకటేశ్వరరావు విశ్రాంత సంయుక్త కమీషనర్ వాణిజ్యపన్నుల శాఖ ఎట్టకేలకు జీఎస్టీ రేట్లలో మార్పులు సాకారమయ్యాయి. పన్ను శ్లాబులు రెండుకు తగ్గాయి. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు నిస్సందేహంగా దేశానికి మేలుచేసేవే. అయితే, ప్రజలకు పూర్తిగా లబ్ధి చేకూరాలంటే- పన్నురేట్లకు సమాంతరంగా ఆయా వస్తువుల ధరలు కూడా తగ్గాలి. అంటే, ప్రభుత్వం జీఎస్టీ తగ్గించిన ఫలితం వస్తువు ఖరీదు తగ్గడం ద్వారా వినియోగదారుడికి చేరాలి. జీఎస్టీ పరోక్ష...