Neti Satyam
Newspaper Banner
Date of Publish : 08 September 2025, 3:11 pm Editor : Admin

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బిఆర్ఎస్ వైఖరి ఆత్మహత్య సదృశ్యం.డా. కె.నారాయణ




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం

*ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బిఆర్ఎస్ వైఖరి ఆత్మహత్యాసదృశ్యం : డాక్టర్ కె.నారాయణ*

*జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వకపోవడం తెలంగాణ ప్రజలను మోసం చేయడమే*

నేటి సత్యం సెప్టెంబర్ 8
హైదరాబాద్ : ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న దేశ ఉపరాష్ట్రపతి పదవికి జరుగుతున్న ఎన్నికలలోబిఆర్ తటస్థ వైఖరి తీసుకోవడం అత్యంత విచారకరమని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం తెలంగాణ ప్రజలను మోసం చేయడమే అవుతుందని విమర్శించారు. తెలంగాణ బిడ్డ్డ జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సహకరించిన వ్యక్తి అని, అనేక చారిత్రాత్మక తీర్పులు ఇచ్చిన న్యాయకోవిదుడు అని అన్నారు. అలాంటి వ్యక్తి ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేస్తుంటే తటస్థంగా ఉండడమంటే బిఆర్ ఆత్మహత్యాసదృశ్యమే అవుతుందని నారాయణ విమర్శించారు. ఏ తెలంగాణ పేరు చెప్పి, ప్రజల సెంటిమెంట్ ఉపయోగించుకొని కెసిఆర్ రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారని, అలాంటిది తెలంగాణ బిడ్డకు ఓటు వేయకుండా గైర్హాజరవడమంటే తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని ధ్వంసం చేయడమే అవుతుందన్నారు