(adsbygoogle = window.adsbygoogle || []).push({});
పిడుగు పడి ముగ్గురు మృతి మరో నలుగురికి గాయాలు
జోగులంబ గద్వాల జిల్లాలో విషాదం
మహబూబునగర్ ప్రతినిధి/ RK సెప్టెంబర్ 10 ( నేటి సత్యం)
ఉమ్మడి మహబూబునగర్ జిల్లాలోని జోగులంబ గద్వాల జిల్లాలో బుధవారం సాయంత్రం ఆకస్మికంగా కురిసిన భారీ వర్షాల వల్ల పిడుగు పడి ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా మరో నలుగురు కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా లోని ఐజ మండలం భూము పురం గ్రామం చెందిన తిమ్మప్ప అనే రైతు పొలంలో సీడ్ పత్తి క్రాసింగ్ పనులకు వెళ్లిన కూలీలు సాయంత్రం ఉరుములు మెరుపులతో ఆకస్మికంగా భారీ వర్షం కురిసిన నేపథ్యంలో తలదాచుకోవడానికి పక్కనే ఉన్న వేప చెట్టు కిందకు వెళ్లిన సమయంలో ఆకాశంలో ఒక్కసారిగా పెద్ద శబ్దాలతో కూడిన ఉరుములు మెరుపులు. వచ్చాయని వర్షానికి చెట్టు కింద తలదాచుకున్న ముగ్గురు వ్యక్తులు అదే గ్రామానికి చెందిన సర్వేష్ (19) పార్వతి ( 28) తోపాటు ఐజ మండలం పులికల్ గ్రామానికి చెందిన సౌభాగ్య (45) అనే కూలీలు అక్కడికక్కడే మరణించగా ఈ పిడుగు ప్రమాదంలో మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి అదే గ్రామానికి చెందిన భార్యాభర్తలు రాజు జ్యోతి తో పాటు కావ్య తిమ్మప్పకు తీవ్ర గాయాలు అయ్యాయి వెంటనే గాయపడిన కూలీలను చికిత్స నిమిత్తం ఐజ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటన జోగులమ్మ గద్వాల జిల్లాలో అందరిని కలిసి వేసింది. ఒక గ్రామంలో మరణించిన కుటుంబాలను భూమిపురం గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతుల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని ఆ గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఉపాధి కోసం జీవనోపాధి కోసం మూడు పూటలా తిండి కోసం పేద ప్రజలు ఈ అకాల మరణం పొందడం పట్ల ఆ కుటుంబ సభ్యులు ఆలన పాలన లేక ఆందోళన చెందుతున్నారు. కుటుంబాన్ని పోషించ వలసిన పెద్ద దిక్కు కోల్పోవడం పట్ల దిక్కు లేక దిగులు చెందుతున్న పేద కుటుంబాలను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని గాయపడ్డ కూలీలను మెరుగైన చికిత్స అందించి ఆదుకోవాలని గద్వాల జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.