(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం సెప్టెంబర్ 11
*సదాబైనామా భూముల రెగ్యులరైజేషన్‌కు తెలంగాణ ప్రభుత్వం జి.ఓ. విడుదల*
తెలంగాణ ప్రభుత్వం సదాబైనామాల ద్వారా కొనుగోలు చేసిన భూములను రెగ్యులరైజ్ చేయడానికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం జి.ఓ. ఎం.ఎస్. నం.106ను విడుదల చేసింది.
తెలంగాణ భూ భారతీ (రికార్డు ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్) చట్టం–2025 (చట్టం నం.1 ఆఫ్ 2025)లోని సెక్షన్ 6(1) ప్రకారం, 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు స్వీకరించిన సదాబైనామా దరఖాస్తులను పరిశీలించి ప్రాసెస్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
చిన్న మరియు సూక్ష్మ రైతులు వ్యవసాయ భూములపై 12 ఏళ్లకు పైగా కబ్జా చేసుకొని, 2024 జూన్ 2లోపు ఆధార పత్రాలను కలిగి ఉన్నవారికి ఈ నిబంధనలు వర్తిస్తాయి. రిజిస్ట్రేషన్ చేయని లావాదేవీల ఆధారంగా భూమి హక్కులు చట్టబద్ధం అయ్యేలా చర్యలు చేపట్టనుంది.
ఈ నిర్ణయంతో వేలాది మంది రైతులకు న్యాయం జరగనుందని, వారికి భూ హక్కుల పత్రాలు, పాసుబుక్స్ జారీ అయ్యే అవకాశం ఉందని రేవెన్యూ శాఖ అధికారులు తెలిపారు.
ఈ నోటిఫికేషన్‌ను గెజిట్‌లో ప్రచురిస్తూ, జిల్లా కలెక్టర్లు, రేవెన్యూ శాఖ అధికారులు తక్షణమే అమలు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.