నేటి సత్యం సెప్టెంబర్ 13
మేడారం జాతర
మేడారం జాతర ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష
సమీక్ష నిర్వహించిన పొంగులేటి, సీతక్క, కొండా సురేఖ
జాతర నిర్వహణ, ఆధునికీకరణ పనులపై చర్చ
🌷వైసీపీ కార్యకర్తలు గిరిధర్, సతీష్‌కు జగన్ పరామర్శ
మచిలీపట్నంలో గిరిధర్, సతీష్‌పై జనసేన నేతల దాడి
ఫోన్ చేసి దాడి ఘటనపై వివరాలు తెలుసుకున్న జగన్
దాడికి గురైన కార్యకర్తలకు అండగా ఉంటామన్న జగన్
🌷బాలీవుడ్ నటి దిశా పటానీ ఇంటిముందు కాల్పులు
ఉత్తరప్రదేశ్ బరేలీలోని దిశా ఇంటి ముందు కాల్పులు
కాల్పులు తామే జరిపామన్న గోల్డీ బ్రార్ గ్యాంగ్
దిశా సోదరి ఖుష్బూ సాధువులను అవమానించారని ఆరోపణ
🌷ఫ్యాన్సీ నెంబర్లతో తెలంగాణ రవాణా శాఖకు భారీ ఆదాయం
ఖైరతాబాద్ RTAకు ఒక్కరోజే రూ.63.77 లక్షల ఆదాయం
రూ.25.50 లక్షలు పలికిన 9999 నెంబరు
రూ.6.50 లక్షలు పలికిన 0009 నెంబరు
🌷నేడు తెలంగాణలోని పలు జిల్లాలకు వర్షసూచన
నిర్మల్, నిజామాబాద్,మెదక్, కామారెడ్డి జిల్లాల్లో..
భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి వికారాబాద్..
మహబూబ్‌నగర్, వరంగల్, హనుమకొండకు భారీ వర్షసూచన
మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి..
ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, జగిత్యాల..
సిరిసిల్ల, భూపాలపల్లి జిల్లాలకు భారీ వర్షసూచన
🌷అన్నమయ్య: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం
రోడ్డు దాటుతున్నవారిని ఢీకొన్న RK ట్రావెల్స్ బస్సు
ఇద్దరు మృతి, మరో మహిళకు తీవ్ర గాయాలు
ఓబులవారిపల్లె మండలం మంగళంపల్లిలో ఘటన
మృతులు అంకమ్మ(70), రామచంద్రయ్య(55)
🌷మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు సుజాతక్క లొంగుబాటు
మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్‌గా ఉన్న సుజాతక్క
గద్వాలకు చెందిన సుజాతక్క అలియాస్ పోతుల కల్పన
1984లో కిషన్‌జీని వివాహం చేసుకున్న సుజాతక్క
మొత్తం 106 కేసుల్లో నిందితురాలు సుజాతక్క