నేటి సత్యం సెప్టెంబర్ 14

*ప్రైవేట్ కళాశాల బంద్ కు ఏఐఎస్ఎఫ్ మద్దతు*
*లక్షలాది మంది విద్యార్థుల చదువులతో ప్రభుత్వం చెలగాటం*
*వెంటనే ఫీజు బకాయిలు విడుదల చేయాలి*
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శి కసిరెడ్డి మణికంఠ రెడ్డి,పుట్ట లక్ష్మణ్
నేటి సత్యం హైదరాబాద్ సెప్టెంబర్ 14
తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 15 నుండి(రేపటి) ప్రైవేట్ డిగ్రీ ,పీజీ, ఇంజనీరింగ్ కళాశాలలు చేస్తున్న నిరవధిక బంద్ కి ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు బకాయిల విడుదలపై నిర్లక్ష్యం చేస్తూ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తుందని, రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు తాము అధికారంలోకి వచ్చాక వెంటనే పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 21 నెలలు గడుస్త ఉన్న ఫీజు బకాయిలు ఎందుకు విడుదల చేయడం లేదో సమాధానం చెప్పాలని, రాష్ట్రం అప్పుల్లో ఉన్నా సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీలు అమలు చేస్తున్నామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వాల్సిన 8000 వేల కోట్ల ఫీజు బకాయిలు ఎందుకు ఇవ్వడం లేదని, ఫీజు బకాయిల విడుదల లేక విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం కళాశాలలకు అప్పులు చేసి మరి ఫీజులు కట్టే పరిస్థితి వచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం అందాల పోటీలకు, మంత్రులు హెలికాప్టర్లో తిరగడానికి, పక్క రాష్ట్రాల్లో పత్రిక ప్రకటనలు ఇవ్వడానికి ఉన్న నిధులు విద్యార్థుల ఉన్నత చదువులకు ఆసరాగా ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి నిధులు ఇవ్వకుండా నేడు కళాశాలలు బంద్ చేసే పరిస్థితి ప్రభుత్వమే తీసుకొచ్చిందని, కళాశాలలు బంద్ చేయడం వల్ల విద్యార్థుల చదువులకు పూర్తిగా ఆటంకం కలుగుతుందని, కనీసం ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుపై దృష్టి పెట్టకుండా ఫీజు బకాయిల విడుదలలో నిర్లక్ష్యం చేయడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు నేడు రాష్ట్రంలో ఫీజు బకాయిల విడుదల లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అటు ప్రైవేట్ కళాశాలలు సైతం ఫీజు బకాయిల విడుదల లేక కళాశాలల నిర్వహణ చేయలేక, సిబ్బందికి జీతాలు ఇవ్వలేని స్థితిలో యాజమాన్యాలు ఉన్నాయని, సీఎం రేవంత్ రెడ్డి తన వద్ద విద్యాశాఖ ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేయించడంలో వైఫల్యం చెందడానీ, విద్యార్థుల చదువులకు ఆటంకాలు లేకుండా
ప్రభుత్వం వెంటనే కళాశాలల యాజమాన్యాలతో చర్చలు జరిపి బంద్ విరమింపజేసి పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు