Neti Satyam
Newspaper Banner
Date of Publish : 14 September 2025, 3:45 pm Editor : Admin

మహబూబ్నగర్లో. పడకేసిన పారిశుధ్యం!!




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

*శివ శక్తి నగర్*
*పడకేసిన పారిశుధ్యం*
*పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు*
*పనులకు అనుమతులు ఉన్నా ప్రారంభంలో జాప్యత*
*నాణ్యత లోపంతో కట్టిన బ్రిడ్జికి పగుళ్లు*

మహబూబ్నగర్ మునిసిపాలిటీ స్థానిక 23వ వార్డులోని శివశక్తినగర్ కాలనీ లో వర్షాలకు దెబ్బతిన్న మురుగు కాలువల విషయంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. సమస్యను తెలియజేసిన చూసి చూడనట్టుగా ఉంటున్నారు.
కొన్ని నెలల క్రిందట కమాన్ ముందల నిర్మించిన చిన్న బ్రిడ్జి, నాణ్యతా లోపంతో పగుళ్లు ఏర్పడ్డాయి.

అదేవిదంగా నాలా సమస్య గురించి అధికారులను అడగగా పనులకు సంబంధించి అనుమతులు రావడం జరిగింది, పనులు ప్రారంభం అవుతాయని గత సంవత్సరం గా దాటేస్తున్నారు.

ఈ సమస్యలను త్వరగా పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ గారిని కోరుతున్నాం….లేని పక్షాన వార్డు ప్రజలతో పెద్దఎత్తున నిరసనలు తెలియజేస్తాం అని తెలియజేస్తున్నాము.
మీ
సి సంపత్ కుమార్
బీజేపి
పాలమూరు.