(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం 
మియాపూర్
*అస్తవ్యస్తంగా మారిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ*
*కమిషన్లకు కక్కుర్తిపడి పర్యవేక్షణ చేయని అధికారులు, ప్రజా ప్రతినిధులు*
ఈరోజు మియాపూర్ డివిజన్ వివిధ కాలనీలో పర్యటించిన యం సి పీ (యు) నాయకులు
ఈ సందర్భంగా యం సి పీ ఐ (యు )మియాపూర్ డివిజన్ కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్ మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం వల్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అస్తవ్యస్తంగా మారుతున్నది.మియాపూర్ ప్రాంతంలోని వివిధ కాలనీలలో ఎం ఎ నగర్, స్టాలిన్ నగర్, నడిగడ్డ తాండ, హె డి ఎఫ్ సి (HDFC) బ్యాంక్ హై టెన్షన్ రోడ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పొంగిపొర్లుతున్న ,మ్యాన్ హోల్స్ ఎక్కడికక్కడ విరిగిపడిన అధికారులు కమిషన్లకు కక్కుర్తి పడి పాడైన మ్యానువల్స్ ను డ్రైనేజీ వ్యవస్థను సరిచేయడంలో విఫలమవుతునన్నారు. కాంట్రాక్టర్లతో సంబంధిత అధికారులు కుమ్మక్కై కమిషన్లకు ఆశపడి కాంట్రాక్టర్లు చేసే పనులలో నాణ్యతను పరిశీలించకపోవడంతో రిపేరు చేసిన రెండు మూడు రోజులకే మళ్లీ పాడైపోతున్నవి. కాంట్రాక్టర్ చేసిన పనులను సంబంధిత అధికారుల, ప్రజా ప్రతినిధులు, పర్యవేక్షణ లేకపోవడం దీనికి ప్రధాన కారణం. ఇటీవల రెండు రోజుల క్రితం ఎమ్.ఏ. నగర్ రోడ్డు నెంబర్ 1 ,8 లలో మ్యాన్ హోల్స్ కట్టిన మరుసటి రోజు బీటలు వారీ వాడక ముందే పాడైపోయినాయి. ఇలాంటి పరిస్థితి అన్ని ప్రాంతాల్లో జరుగుచున్నది. ఈ మధ్యకాలంలో కురుస్తున్న భారీ వర్షానికి డ్రైనేజీలు పొంగి మరుగు నీరంతా రోడ్లపై కి వచ్చి ప్రజలు సీజనల్ వ్యాధులకు గురవుతున్నారు. తక్షణం డ్రైనేజీ వ్యవస్థను పాడైన మాన్ హోల్సు ను తక్షణమేనాణ్యమైన రిపేరుచేయించాలని ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఎంసిపిఐ(యు)మియాపూర్ డివిజన్ కమిటీ తరుపున డిమాండ్ చేస్తున్నాం . సమస్యలు పరిష్కరించకపోతే
జన సమీకరణ చేసి సంబంధిత కార్యాలయం ముందు ఆందోళన చేపడతామని , యం సి పి ఐ (యు) మియాపూర్ డివిజన్ కార్యదర్శి ఇస్లావత్ దశరథ నాయక్ హెచ్చరించారు . ఈ కార్యక్రమంలో యం సి పీ ఐ (యు ) మియాపూర్ డివిజన్ సహాయ కార్యదర్శి పల్లె మురళి, స్థానిక పార్టీ సభ్యులు మైదం శెట్టి రాణి, డి శ్రీనివాసులు, స్థానికులు పాల్గొన్నారు