నేటి సత్యం
*తెలంగాణ యోధుల చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి*
*సాయుధ పోరాట చరిత్ర వక్రీకరిస్తున్న పాలకులు*


*తెలంగాణ విలీనంపై మాట్లాడే హక్కు బీజేపీకి లేదు*
* *టి రామకృష్ణ సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు* *
* *తెలంగాణ రైతన్న సాయుధ పోరాటాల వారోత్సవాల సందర్భంగా జెండా ఆవిష్కరించిన రామకృష్ణ*
: తెలంగాణ విలీనం దినోత్సవంపై మాట్లాడే హక్కు బిజెపికి ఎంతమాత్రం లేదని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి రామకృష్ణ అన్నారు.
ఈ నెల 11 నుండి రాష్ట్ర వ్యాప్తంగా వారోత్సవాలు జరుపుకొని. 17 ముగింపు రావి నారాయణరెడ్డి ఆడిటోరంలో జరిగింది ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ
తెలంగాణ సాయుధ పోరాటం ద్వారానే ప్రజలకు స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు లభించాయని, కానీ తెలంగాణ సాయుధ పోరాటం చరిత్రను పాలకులు వక్రీకరిస్తున్నారని అన్నారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విలీన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విలీన దినోత్సవంపై కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కపట నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. విమోచన దినోత్సవం పేరిట బీజేపీ చేపట్టిన కార్యక్రమాలు ప్రజలను మభ్యపెట్టేందుకేనని, నైజాం వ్యతిరేక పోరాటంలో బిజెపి పాత్ర ఏమాత్రం లేదన్నారు. పైగా తెలంగాణ పోరాటాన్ని హిందూ,ముస్లీం మద్య జరిగిన గొడవగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులేనని స్పష్టం చేశారు. తెలంగాణ విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని, ట్యాంక్ బండ్ పై సాయుధ పోరాట యోధుల విగ్రహాలు పెడతామని, పాఠ్యపుస్తకాల్లో తెలంగాణ సాయుధ పోరాట పోరాట చరిత్రను చేర్చుతామని చెప్పిన ప్రభుత్వం ఎందుకు ఆ హామీలను నెరవేర్చలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న అన్ని జిల్లా కేంద్రాలలో జాతీయ జెండాలు ఎగురవేయాలని నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నామని, కాని ఆ రోజు ప్రజా పాలన దినోత్సవంగా జరుపుతామనడం సరికాదని అన్నారు. ప్రజలను పీడించిన దొరలు, దేశ్ ముఖ్ లకు నైజాం సర్కారు అండగా ఉండడం వల్లనే నైజాం సర్కారు పై సాయుధ పోరాటానికి సిపిఐ పిలుపునిచ్చిందన్నారు. ఆ పోరాటంలో తెలంగాణలో పది లక్షల ఎకరాల భూమి పంచబడిందని, వేల గ్రామాలను విముక్తి చేయడం జరిగిందని చెప్పారు. నాటి పోరాటంలో దొడ్డి కొమరయ్య మొదలుకొని నాలుగున్నర వేల మంది వీరమరణం పొందినారు 10 లక్షల ఎకరాల భూములు పంచిన చరిత్ర కమ్యూనిస్టులదే
ఈ కార్యక్రమంలో. సిపిఐ జిల్లా సమితి సభ్యులు కె చందు యాదవ్ . కే సుధాకర్. పరమేష్ ఎస్ కొండలయ్య ఎం వెంకటేష్. రామస్వామి సురేఖ బి నారాయణ రఘు. తదితరులు పాల్గొన్నారు