తెలంగాణ రైతన్న సాయుధ పోరాటమే దేశంలో అనేక పోరాటాలకు ప్రేరణ
నేటి సత్యం *తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమే* *దేశంలోని అనేక పోరాటాలకు ప్రేరణ* నేటి సత్యం హైదరాబాద్ సెప్టెంబర్ 17 నిజాం నిరంకుశ పాలనను భూస్వామ్య వ్యవస్థను కూకటివేళ్ళతో పెకించించి వేసిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ప్రేరణనే దేశంలో అనేక ఉద్యమాలకు ఊపిరి పోసిందని పలువురు వక్తలు అన్నారు. ఆ పోరాట ఫలితంగానే ఈ ప్రాంత ప్రజల్లో చైతన్యం రగిలి మెరుగైన తెలంగాణ పౌర సమాజం ఏర్పడిందని వారు పేర్కొన్నారు. సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో...