Neti Satyam
Newspaper Banner
Date of Publish : 17 September 2025, 1:43 pm Editor : Admin

తెలంగాణ రైతంగ సాయుధ సమర చరిత్రను బిజెపి వక్రీకరించడం బాధాకరం కూనంనేని సాంబశివరావు!!




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం సెప్టెంబర్ 17

(సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ విలీన దినోత్సవం వేడుకలు)
తెలంగాణ రైతాంగ సాయుధ సమర చరిత్రను బిజెపి వక్రీకరించడం గర్హనీయం ః కూనంనేని సాంబశివరావు

హైదరాబాద్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల త్యాగాలను తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తిని, ఈ సమరంలో అసువులు బాసిన అమర వీరులను బిజెపి హైజాక్ చేసే ప్రయ్నతం చేస్తూ కొత్త నినాదాలతో చరిత్రను వక్రీకరించడం గర్హనీయమని సిపిఐ రాష్ట్రకార్యదర్శి, ఎంఎల్ ఎస్ కూనంనేని సాంబశివరావు అన్నారు. భూస్వాములు, వారి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నాడు కులాలు, మతాలకు అతీతంగా శ్రామికవర్గమంతా ఏకమై సాగించిన సమరమే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమని, ఆ మహాత్తర ఉద్యమాన్ని బిజెపి హిందూ, ముస్లింల మధ్య జరిగిన ఘర్షణగా చిత్రీకరించే ప్రయత్నం చేయడాన్ని చరిత్ర క్షమించదని పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 77వ వారోత్సవాల ముగింపు సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్ బుధవారం జాతీయ పతాకాన్ని సిపిఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా, అరుణ పతాకాన్ని కూనంనేనిసాంబశివరావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట రెడ్డి, పశ్యపద్మ, రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాస రావు, కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్, గోదా శ్రీరాములు, ఆర్.అంజయ్య నాయక్, కలకొండ కాంతయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని బిజెపి ఎంత గట్టిగా మతపరమైన పోరాటంగా చిత్రీకరిస్తుందో అంతే బలంగా ఇది కమ్యూనిస్టులు చేసిన వీరోచిత పోరాటమని ప్రజల్లోకి వెళుతుండడం మనందరికీ గర్వకారణమే అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికక్కడ నాటి పోరాటంలో అసువులు బాసిన వీరయోధుల, అమరవీరుల త్యాగాలకు గుర్తుగా ఉన్న స్థూపాలే ఇందుకు నిదర్శమని ఎవరూ చరిత్ర చెరిపి వేద్దామనుకున్న చెరిగిపోనిది అని అన్నారు. సిపిఐ సీనియర్ నాయకులు ఉజ్జని రత్నాకర్ రావు, కె.ఏసురత్నం, బి.ఆర్.ఎస్ మోహన్ ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి బి.వెంకటేశం, డిహెచ్ ప్రధాన కార్యదర్శి ఎం.అనిల్ కుమార్, ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు కె.శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ్మా, ఎఐవైఎప్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధర్మేంద్ర, ఎఐఎస్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠరెడ్డి తదితరులు పాల్గొన్నారు.