నేటి సత్యం 


చందానగర్ డివిజన్ పరిధిలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన కాంగ్రెస్ నాయకులు రఘునాథ్ రెడ్డి గారు..
నేటి సత్యం చందానగర్ సెప్టెంబర్ 18
గత రాత్రి కురుసిన భారీ వర్షాల కారణంగా చందానగర్ డివిజన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీప్తిశ్రీ నగర్,విశ్వేశ్వర కాలనీ, రెడ్డి కాలనీతో పాటు పలు కాలనీలు వరద నీటితో నిండిపోయాయి..దీంతో చందానగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి గారు వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు.స్థానికంగా నెలకొన్న పరిస్థితులను పరిశీలించిన అనంతరం, GHMC అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించారు..
ఈ సందర్భంగా రఘునాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ,భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు..వరద నివారణ చర్యలు చేపట్టాలని అదీకారులకు సుచించారు.. ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించాలని కోరారు..ప్రజలు వర్షాలు కురిసే సమయంలో బయటకు రాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు..