నేటి సత్యం సార్ లింగంపల్లి సెప్టెంబర్ 20 

ప్రధాని మోదీ జన్మదిన స్ఫూర్తితో స్వచ్ఛ భారత్ కార్యక్రమం…బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు బోయిని మహేష్ యాదవ్
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి 75వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘సేవా పఖ్వాడా’ (సేవా కార్యక్రమాల పక్షోత్సవాలు)లో భాగంగా బీజేపీ హఫీజ్ పేట్ డివిజన్ ఓబీసీ మోర్చా అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో డివిజన్ అధ్యక్షులు జితేందర్ గారి అధ్యక్షత శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని హఫీజ్ పేట్ డివిజన్ ఓల్డ్ హఫీజ్ పేట్ హనుమాన్ దేవాలయంలో మోదీ గారి పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించి తదనంతరం ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోయిని మహేష్ యాదవ్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ యాదవ్ గారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ గారి నిస్వార్థ సేవ, దేశాభివృద్ధికి ఆయన పడుతున్న తపన ప్రతీ కార్యకర్తకు, ప్రతీ పౌరునికి ఆదర్శనీయం అన్ని అన్నారు.మోడీ గారి జన్మదినాన్ని వేడుకగా కాకుండా, ప్రజాసేవతో జరుపుకోవాలనే గొప్ప సంకల్పంతో బీజేపీ ‘సేవా పఖ్వాడా’ను నిర్వహిస్తోంది” అన్ని అన్నారు.పరిశుభ్రత ఉన్నచోటే ఆరోగ్యం, అభివృద్ధి ఉంటాయని ప్రధాని మోదీ ఇచ్చిన ‘స్వచ్ఛ భారత్’ పిలుపును స్ఫూర్తిగా తీసుకుని,అన్ని ప్రాంగణాన్ని శుభ్రపరచడం ద్వారా ప్రతి ఒక్కరికి పరిశుభ్రతపై అవగాహన పెరుగుతుంది అన్ని అన్నారు.మోదీ గారి నాయకత్వంలో దేశం అన్ని రంగాలలో పురోగమిస్తోందని, ఆయన ఆయురారోగ్యాలతో దేశానికి మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రమణయ్య,రవి గౌడ్,శ్రీధర్ గౌడ్, శ్రీశైలం,సత్యనారాయణ, బాబు రెడ్డి, జగన్ గౌడ్,రాజు ముదిరాజ్, సురేష్, పవన్,పాలం శ్రీను, సుబ్బారావు, రామారావు, మునిగొండ నవీన్,రాజు,మనోజ్,దేవేందర్ దాస్, నవీన్,నాయకులు,కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.