(adsbygoogle = window.adsbygoogle || []).push({});
*భగత్ సింగ్ స్పూర్తితో డ్రగ్స్, గంజాయి మాధకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడుదాం*
నేటి సత్యం హైదరాబాద్ సెప్టెంబర్ 20
సెప్టెంబర్
*భగత్ సింగ్ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రూపొందించి, అమలు చేయాలి*:
*భగత్ సింగ్ 118వ జయంతి కరపత్రం విడుదల*:
*వలి ఉల్లా ఖాద్రీ, కల్లూరు ధర్మేంద్ర,ఏఐవైఎఫ్*
రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి
సెప్టెంబర్ 28న భగత్ సింగ్ 118వ జయంతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని,భగత్ సింగ్ స్పూర్తితో డ్రగ్స్, గంజాయి మాధకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడుదామని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ, కల్లూరు ధర్మేంద్ర డిమాండ్ చేశారు. AIYF తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో భగత్ సింగ్ 118వ జయంతి కి సంబంధించిన కరపత్రాన్ని హిమాయత్ నగర్ లోని సత్యనారాయణ రెడ్డి భవన్ లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా *ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ, కల్లూరు ధర్మేంద్ర* మాట్లాడుతూ భగత్ సింగ్ జీవితం భారత దేశ యువతకు స్ఫూర్తిదాయకమని, అటువంటి మహనీయుని త్యాగాలను నేటి సమాజానికి తెలపాల్సిన భాద్యత పాలకులదేనని వారు ఉద్ఘాటించారు. భగత్ సింగ్ జయంతిని పాలకులు అధికారికంగా నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. భగత్ సింగ్ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రూపొందించాలని వారు డిమాండ్ చేశారు. ప్రజల ఐక్యతను చీల్చే మతోన్మాద రాజకీయాలు నేడు దేశంలో విచ్చలవిడిగా కొనసాగుతున్నాయని, స్వాతంత్య్ర ఉద్యమ కాలంలోనైనా…. నేటి కాలంలోనైనా అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చి దోపిడీదారులకు ఉపకరించే, దేశ ద్రోహ కర్తవ్యాన్నే మతోన్మాద శక్తులు నెరవేరుస్తున్నాయని ధ్వజమెత్తారు. దేశ స్వాతంత్య్ర సముపార్జన ధ్యేయంగా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన భగత్ సింగ్ స్వాతంత్ర్య అనంతరం కుల, మతాలకు అతీతంగా ధనిక, పేద తారతమ్యాలు లేని, అవినీతి రహిత సమసమాజ స్థాపన కలలు కన్నాడన్నారు. మతోన్మాద ముక్త భారతం సాదించడానికి భగత్ ఆలోచనలు, ఆయన చూపిన కార్యాచరణ, మనకు తరగని స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. ఇనుప కండరాలు, ఉక్కునరాలు గల యువత దేశానికి అవసరం అని ప్రభోదించి సూక్తిగా నిలిచి “ఆత్మ విశ్వాసంకు మించిన ఆయుధం లేదని చాటి చెప్పిన భగత్ సింగ్ ప్రేరణతో, యువజనులతో మమేకమై ఉత్తేజ, ఉద్వేగభరితమైన ఉద్యమాలు సాగిస్తూ ఏఐవైఎఫ్ యవజనుల గుండెల్లో నిలిచిందన్నారు.
సామాజిక, న్యాయం, లౌకిక వాదన పరిరక్షణ, శాస్త్రీయ సోషలిజం, తీవ్రవాదానికి వ్యతిరేకంగా శాంతి స్థాపన కోసం, అశ్లీల సాహిత్యం, అశ్లీల సినిమాల నిషేధం కోసం, దేశాన్ని చీల్చడానికి కుట్రలు చేనే వచ్చిన్నకర శక్తులకు వ్యతిరేకంగా, దేశ ఐక్యత, సమైక్యత కోసం AIYF కృషిచేస్తున్నదన్నారు. ఇంతటి పోరాట చరిత్ర కలిగిన AIYF ఆధ్వర్యంలో భగత్ సింగ్ 118వ జయంతిని పురష్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా క్రీడోత్సవాలు, వ్యాస రచన, చిత్రలేఖన పోటీలు, సదస్సులు, ర్యాలీలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో *ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్, రాష్ట్ర ఉపాధ్యక్షులు టి. సత్య ప్రసాద్,శ్రీమాన్, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్. బాల కృష్ణ,శివకుమార్, రాష్ట్ర సమితి సభ్యులు షేక్ మహమూద్, కళ్యాణ్,మధుకర్, వెంకటేష్, రాజ్ కుమార్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.