Neti Satyam
Newspaper Banner
Date of Publish : 20 September 2025, 12:44 pm Editor : Admin

ఆడపడుచుల పెద్ద పండుగ బతుకమ్మ!!




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం*శేరిలింగంపల్లి* సెప్టెంబర్ 20

ఆడపడుచుల పెద్ద పండుగ బతుకమ్మ… రాగం నాగేందర్ యాదవ్ గారు.

9 రోజులపాటు పూలనే దేవతలుగా ఆరాధించే గొప్ప సాంప్రదాయం మనదని కార్పొరేటర్ గారు అన్నారు.

పాఠశాలలకు రేపటి నుండి సెలవు రోజులు అవ్వడం వలన శేరిలింగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన బతుకమ్మ పండుగ వేడుకలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. విద్యార్థినులు తెచ్చిన తంగేడు, గునుగు, తామర, చామంతి, బంతి పూలతో తెలంగాణ సంస్కృతిని ఉట్టిపడేలా పేర్చిన బతుకమ్మను చూసి కార్పొరేటర్ గారు అభినందించారు. పాఠశాల ఆవరణలో విద్యార్థినిలతో కలిసి బతుకమ్మ డీజే స్టెప్పులకు చప్పట్లు కొడుతూ విద్యార్థినిలతో ఆడి పాడి వారిలో జోష్ నింపారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు మాట్లాడుతూ… ప్రతి మనిషి జీవితానికి ప్రకృతితో విడదీయరాని అనుబంధం పెనవేసుకొని ఉంటుందని ప్రకృతి మనిషికి జీవంతో పాటు అహ్లాదాన్ని, ఆనందాన్నిస్తుందని అలాంటి ప్రాస్తశ్యం బతుకమ్మ పండుగకు ఉందని తెలిపారు. 9 రోజులు 9 రూపాల్లో బతుకమ్మను తయారుచేసి పాటలు పాడుతూ భక్తిశ్రద్ధలతో ‘బతుకమ్మ’ పండుగను తెలంగాణ వ్యాప్తంగా పిల్లాపెద్ద ప్రతిఒక్కరూ ఘనంగా జరుపుకుంటారని 9 రోజులపాటు పూలనే దేవతలుగా ఆరాధించే గొప్ప సంప్రదాయం మనదని వివరించారు.

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుభాష్ చంద్రరెడ్డి, పి.ఆర్.టీ.యు టి.ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్యామల మహేందర్ రెడ్డి, ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు బల్వంత్ రెడ్డి, పిఈటీ కేశవ రెడ్డి, ఉపాధ్యాయులు వీరేశం, ఆంజనేయులు, కర్ణ, లక్ష్మి, ఉదయకుమారి, దుర్గా భవాని మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థి విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.