నేటి సత్యం నాగర్కర్నూల్ సెప్టెంబర్ 20


*కమ్యూనిస్టులు ఐక్యతను తన చివరి శ్వాస వరకు కోరుకున్న సురవరం కమ్యూనిస్టు పార్టీల ఐక్యత సుధాకర్ రెడ్డి కి నిజమైన నివాళులు సిపిఐ జాతీయ నేతలు చాడ వెంకటరెడ్డి పల్లా వెంకటరెడ్డి*
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి మాజీ పార్లమెంటు సభ్యుడు మట్టి మనుషుల మహా నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి గారు తమన జీవితంలో తుది శ్వాస వరకు కమ్యూనిస్టుల ఐక్యతనే కోరుకున్నారని ఈ దేశంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీల ఐక్యం కావడం ద్వారానే సురవరం సుధాకర్ రెడ్డి గారికి నిజమైన నివాళి అర్పించిన వాళ్ళమవుతావని నేడిక్కడ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్లో జరిగిన సురవరం సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభలో వారు తెలియజేశారు ఈ సభకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారు సుధాకర్ రెడ్డి గారి జీవితమంతా ప్రజల కోసమే బ్రతికాడని పుట్టుక నాది చావు నాది నడి మధ్య జీవితమంతా ప్రజలదే అన్నంతగా వారి జీవన పరిణామ క్రమమంతా సాగిందని నేతలు తెలియజేశారు అంతరాలు లేని సమాజం రావాలని డబ్బు కులము ప్రాంతము హోదా మతం ఇవేవీ మనుషుల మధ్య విభజన రేఖలు గీయడానికి వీలు లేదని అలాంటి అంతరాలు లేని సమసమాజ స్థాపన తన జీవిత ధ్యేయంగా బతికినన్ని నాళ్ళు ఎర్రజెండా నీడలో పీడిత తాడిత ప్రజల సమస్యల విముక్తికై అహర్నిశల పోరాడిన మహావీరుడు సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు దేశంలో కమ్యూనిస్టు ఉద్యమం చీలిక తర్వాత కమ్యూనిస్టు పార్టీలు మెలమెల్లగా బలహీనపడుతూ వస్తున్నాయని ఇది దేశ ప్రగతికి అత్యంత ప్రమాదకరమని దాని పరిణామాలు నేడు మనం చూస్తున్నామని వారు జీవించి ఉన్నప్పుడు అనేక సభల్లో వ్యాసాల్లో ఇంటర్వ్యూలో వారు చెప్పడం జరిగింది అని వారు గుర్తు చేశారు దేశంలో పెరిగిపోయిన మతోన్మాదం కులం మాదాన్ని క్రోనీ క్యాపిటల్ పెట్టుబడిదారీ వ్యవస్థకు సలాములు కొట్టే నేడు ఉన్న ఈ బూర్జవ ప్రభుత్వాలను గద్దతించాలంటే ఈ దేశంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీలన్నీ ఏకం కావాలని ఆయన కలలు కన్నారని వారు గుర్తు చేశారు సురవరం సుధాకర్ రెడ్డి గారు దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్లిన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అందులోనూ నాగర్కర్నూల్ జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం కలిగిన వ్యక్తి అన్నారు జిల్లాలో ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారం కోసం పోరాటాల రూపకల్పన చేసిన రూపశిల్పి సుధాకర్ రెడ్డి అని వారు అన్నారు ఈ ఉమ్మడి జిల్లాలో ప్రస్తుత రాష్ట్రంలో ఉన్నటువంటి సిపిఐ నాయకత్వంత వారి ద్వారా ప్రభావితమై ఉద్యమాలకు వచ్చిన వాళ్లే అని ఈ సందర్భంగా చాడా వెంకటరెడ్డి పల్లా వెంకటరెడ్డిలు తెలియజేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్ధన్ పర్వతాలు సురవరం కపిల్ లు మాట్లాడుతూ త్యాగాల తరమై వెళ్ళిపోతుందని తొలి తరపు కమ్యూనిస్టు నాయకులంతా ఒక్కరికి ఒక్కొక్కరిగా మన నుంచి దూరం అవుతున్నారని ఇది చాలా దురదృష్టకరమని కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారి ఆశయ సిద్ధి కోసం ఈ జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని బలోపేతమైన నిర్మాణంగా తీర్చిదిద్ది వారికి నిజమైన నివాళులు అర్పిస్తామని ఈ జిల్లాలో సాగునీరు ప్రాజెక్టులు గాని ఇతర అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటిలోనూ సురవరం సుధాకర్ రెడ్డి గారి ఆలోచన విధానం ఇమిడి ఉందని వారు బ్రతికున్నప్పుడే కాక చనిపోయిన తర్వాత కూడా వారి పార్థిక శరీరాన్ని 250 మంది డాక్టర్లు డాక్టర్లు కావడానికి ఉపయోగపడడానికి దానమిచ్చిన వారి ఆదర్శప్రాయమైన నిర్ణయం నేటి సమాజంలో ఉన్న రాజకీయ నేతలందరికీ గొప్ప ఆదర్శమని వారు కొనియాడారు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏ ఉద్యమ నాయకునికి ఏ గొప్ప రాజకీయ నాయకుని కూడా దక్కనత గౌరవం వారు చనిపోయినప్పుడు రెండు తెలుగు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర ప్రజలంతా సుధాకర్ రెడ్డి గారి కీర్తిని కొనియా అని వారు గుర్తు చేశారు ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు హెచ్ ఆనంద్ గారు అధ్యక్షత వహించగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు వార్ల వెంకటయ్య కేశవ గౌడ్ జిల్లా కార్యవర్గ సభ్యులు టి నరసింహ ఈర్ల చంద్రమౌళి పి విజయుడు కే యేసయ్య ఆర్ ఇంద్రమ్మ కొమ్ము భరత్ జిల్లా పార్టీ సీనియర్ నాయకులు జిల్లా పార్టీ సమితి సభ్యులు ఆకి మురళి పి భాస్కరరావు మారేడు శివశంకర్ బిజ్జా శ్రీనివాసులు ఎస్ శంకర్ గౌడ్ బండి లక్ష్మీపతి టీ మల్లయ్య కే రవీందర్ బొల్లెద్దుల శీను తుమ్మల శివుడు కృష్ణాజి ఎండి ఉత్బద్దీన్ ఎస్టివ్ రాష్ట్ర అధ్యక్షులు పర్వత్ రెడ్డి మురళి ఈశ్వర్ కే వెంకటమ్మ కవి సుబ్బయ్య ఏ కాశన్న అరసరం జిల్లాల అధ్యక్షులు మద్దిలేటి సీతారాములు కందికొండ గీత పి గోపాల్ టి కిరణ్ కుమార్ మర్యాద వెంకటయ్య డి అంజి ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొనగా ఈ సభలో ప్రజానాట్యమండలి కళాకారులు ప్రదర్శన విప్లవ గేయాలతో సభను అలరించారు అంతకుముందు సురవరం సుధాకర్ రెడ్డి గారి చిత్రపటానికి నాయకులందరూ నివాళులర్పించారు