(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం సెప్టెంబర్ 23

కాంగ్రెస్ పార్టీ బస్తీ బాట పట్టింది సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.టీపీసీసీ ఉపాధ్యక్షుడు& జహీరాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్& కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి శ్రీ *బండి రమేష్* గారు మంగళవారం రోజున నియోజకవర్గ పరిధిలోని అల్లాపూర్ డివిజన్ సఫదర్ నగర్ ఏ బి సి అండ్ ఈ బ్లాక్ లో స్థానిక నాయకులతో కలిసి విస్తృతంగా పర్యటించారు.త్రాగునీరు రహదారులు డ్రైనేజీ లైన్లు వీధిదీపాలు సుందరీకరణ మొక్కలు నాటడం వంటి మౌలిక సదుపాయాల కల్పనపై ఆయన బస్తీ వాసులతో విస్తృతంగా చర్చించారు. సఫదర్ నగర్ లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మురుగునీరు పారుదలకు ఇబ్బంది ఎదురవుతుందని మురికి నీరు నిలిచి దోమలు వృద్ధి చెందుతున్నాయని స్థానికులు రమేష్ గారి దృష్టికి తీసుకువచ్చారు. ఇక్కడ మంజీరా పైప్ లైన్ల మధ్య ప్రాంతాన్ని సుందరీకరణ చేయాలని సూచించారు.ఆయా సమస్యలపై వాటర్ వర్క్స్ జి ఎం తో పాటు సంబంధిత ఇతర అధికారులతోనూ రమేష్ గారు ఫోన్ లో మాట్లాడి వెంటనే పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, హుస్సేన్, వాజిద్ పాషా, మొయినిద్దీన్ , విట్టల్ రెడ్డి , జమీర్ , సుధాకర్ రెడ్డి , అబ్దుల్లా, నజీర్, నసీర్, షఫీ, కనకయ్య, జఖీర్ ,అహ్మద్ ,రఫీ ,కరీం ,ఇమ్రాన్, గోపాల్ రెడ్డి, పల్లపు వేణు, మోయిజ్ , యాదగిరి, సాయి తులసి తదితరులు పాల్గొన్నారు.