(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం కొందుర్గు సెప్టెంబర్ 23
*RRR మొదట ప్రతిపాదించిన అలైన్మెంట్ ని అమలు చేయాలి*
*సిపిఎం డివిజన్ కార్యదర్శి ఎన్. రాజు డిమాండ్*
కొందుర్గు: మార్చిన అలైన్మెంట్ ను వెనక్కి తీసుకొని మొదట ప్రతిపాదించిన అలైన్మెంట్ ని అమలు చేయాలనీ సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి ఎన్ రాజు డిమాండ్ చేశారు
మంగళవారం నాడు కొందుర్గు మండల కేంద్రంలో తంగేళ్లపల్లి గ్రామంలో గ్రామ రైతు రవీందర్ రెడ్డి అధ్యక్షతన గ్రామంలో రైతులతో రీజినల్ రింగ్ రోడ్ వెళ్తున్న ప్రదేశాన్ని సందర్శించి
అనంతరం వారు సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి ఎన్ రాజు కార్యదర్శివర్గ సభ్యులు రాయి కంటి గోపాల్ శ్రీను నాయక్ పద్మా రెడ్డి మాట్లాడుతూ భూస్వాముల భూములను కాపాడడం కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారుల లబ్దికోసం ప్రభుత్వం అలైన్మెంట్ మార్చిందని అన్నారు. రింగ్ రోడ్డు అంటే రింగు లాగా ఉండాలి కానీ వంకర వంకరలుగా ఎందుకు మారిందో ఎవరి ప్రయోజనాల కోసం మారిందో రేవంత్ రెడ్డి బహిరంగంగా చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. వంశపారం పర్యంగా తరతరాలుగా వ్యవసాయం మీదనే ఆధార పడుతూ జీవనం కొనసాగిస్తున్న సన్న చిన్నకారు పేద రైతుల భూములను ప్రభుత్వం లాక్కోవడం అన్యాయమని,రైతు నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ గతంలో రైతు పోరాటాలు ఢిల్లీ పీఠాన్ని కదిలించే ఉద్యమాలను రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోవద్దని, రైతాంగం తలుచుకుంటే ప్రభుత్వాలే కూలిపోయినటువంటి చరిత్ర ఉందని ఈ సందర్భంగా వారు వివరించారు. తెలంగాణ అంటేనే పోరాటాల అడ్డా అని జమీందారులకు రజాకార్లకు వ్యతిరేకంగా వర్గ పోరాటాలు నిర్వహించిన చరిత్ర రైతులకు ఉన్నదని,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుల పక్షాన నిలబడే వ్యక్తి అయితే తక్షణమే పేద రైతుల భూములను కాపాడాలని అన్నారు. ధర్మమనేది మన వైపు ఉంది అధర్మం ఎంతో కాలం నిలబడదు… మీరు చేస్తున్న ఈ పోరాటానికి రైతు సంఘం ఎల్లవేళలా ముందు ఉండి పోరాటం చేస్తుందని అయన తెలిపారు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు రక్షణగా ఉండకుండా పెట్టుబడిదారులకు మద్దతుగా నిలబడుతున్నాయని, ఐనా సరే రైతులు ధైర్యంగా నిలబడాలని ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఐక్య కార్యచరణతో తిప్పి కొట్టాలని, మనభూమి మనకు దక్కేవరకు పోరాటాలు నిర్వహించాలని
మన ఐకమత్యమే మన భూములను కాపాడుతుందని రైతులందరూ ఐకమత్యంతో ముందుకెళ్లాలని ఆయన సూచించారు. ప్రతి రాజకీయ నాయకుడు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లబ్ది పొందడం కోసం కృషి చేస్తున్నారనీ, రైతుల పక్షాన నిలబడే పరిస్థితి లేదని, అందుకే రైతులను విచ్ఛిన్నం చేసే కుట్ర చేస్తున్నారని, ఈరోజుల్లో రాజకీయాలు అంటే వ్యాపారమే కేంద్రంగా చేస్తున్నారని, రైతుల పక్షాన పేదల పక్షాన నిలబడే పరిస్థితి లేదని ప్రజలను రైతులను బిక్షగాలను చేసే పరిస్థితి ఉందని అన్నారు. మన భూ పోరాటాన్ని వచ్చిందని చేయడం కోసం బూర్జువా నాయకులు మతం,కులం పేరుతో విభజించి ఉద్యమాన్ని నీరుగార్చే కుట్ర చేస్తారని జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ మీకు న్యాయం జరిగే వరకు మీ పక్షాన ఎల్లవేళలా నిలబడతామని తెలిపారు.
కార్యక్రమంలో గ్రామ రైతులు భూ నిర్వాసితుల పోరాట కమిటీ నాయకులు రవీందర్ రెడ్డి లక్ష్మయ్య పెర్మల్ రెడ్డి వెంకట్ రెడ్డి జంగయ్య బచ్చమయ్య వెంకటయ్య మల్లారెడ్డి వెంకటేష్ గౌడ్ కాజన్న బాల్రాజ్ బాలకృష్ణ భీమారం నగేష్ వెంకటేశ్వర రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆంజనేయులు గౌడ్ మైపాల్ రెడ్డి రామస్వామి చంద్రయ్య లక్ష్మయ్య ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.