నేటి సత్యం హైదరాబాద్ సెప్టెంబర్ 26
చండీఘడ్‌లో జరిగిన సిపిఐ జాతీయ మహాసభలో గురువారం రోజు సిపిఐ జాతీయ కార్యదర్శిగా ఎన్నికైన పల్లా వెంకటరెడ్డి, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన కూనంనేని సాంబశివరావులకు ఈ రోజు హైదరాబాద్‌లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్‌లో సిపిఐ సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు తక్కళ్ళపల్లి శ్రీనివాస్‌రావు, ఇ.టి.నరసింహ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేణ శంకర్, సిపిఐ ఎం.ఎల్.సి. నెల్లికంటి సత్యంలు పుష్పగుచ్చం ఇచ్చి శుభాక్షాంలు తెలియజేశారు. సిపిఐ జాతీయ సమితిలో తెలంగాణకు సముచిత స్థానం కల్పించారని వారు పేర్కొన్నారు.