నేటి సత్యం
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి
తెలంగాణ ప్రజల తెగువను ప్రపంచానికి చాటిన నిప్పుకణిక చాకలి ఐలమ్మ గారి 130వ జయంతి సందర్భంలో భాగంగా హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ హఫీజ్ పేట్ వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ గారితో పాటు బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు బోయిని మహేష్ యాదవ్ గారు పాల్గొని ఆ వీరవనిత చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు దర్శన్ గారు, బిక్షపతి గారు, కృష్ణ గారు, సత్యనారాయణ గారు, రాజ్ కుమార్ గారు, నవీన్ గారు, రవి ముదిరాజ్ గారు, అశోక్ నాయి గారు, కుమ్మరి శ్రీశైలం గారు పెద్ద ఎత్తున రజక సంఘం యువకులు పాల్గొన్నారు