Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogటిడబ్ల్యూజెఎస్ లో షాద్నగర్ కు. పదవుల పండుగ

టిడబ్ల్యూజెఎస్ లో షాద్నగర్ కు. పదవుల పండుగ

నేటి సత్యం

*టీడబ్ల్యుజేఎఫ్ లో షాద్ నగర్ కు పదవుల పండుగ..*

*రాష్ట్ర కౌన్సిల్ కు సీనియర్ జర్నలిస్ట్ కేపీ..*

*టీడబ్ల్యుజేఎఫ్ జిల్లా సలహాదారుడుగా లట్టుపల్లి మోహన్ రెడ్డి..*

*జిల్లా ఉపాధ్యక్షుడిగా భవాని వేణుగోపాల్..*

*జిల్లా సహాయ కార్యదర్శిగా మన్సూర్ అలీ ఖాన్..*

*జిల్లా కార్యవర్గ సభ్యుడిగా ఎం.డి వహీద్*

*షాద్ నగర్ జర్నలిస్టుల హర్షం*

నేటి సత్యం షాద్నగర్. సెప్టెంబర్ 27

షాద్ నగర్ జర్నలిస్టుల ఐక్యతను గుర్తించిన టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర, జిల్లాస్థాయి పదవుల్లో వారికి అవకాశం కల్పించింది. జిల్లా వ్యాప్త జర్నలిస్టులు కూడా దీనికి పూర్తిస్థాయిలో మద్దతు పలికారు. దీనితో షాద్ నగర్ కు ఒక రాష్ట్ర స్థాయి పదవితో పాటు, నాలుగు జిల్లా స్థాయి పదవులు దక్కాయి. దీనిపై స్థానిక జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరులో జరిగిన టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా 3వ మహాసభల సమావేశంలో జిల్లా స్థాయిలో రెండు పదవులు ఖరారు కాగా, తాజాగా మరో రెండు పదవులు ఖరారు అయ్యాయి. రాష్ట్ర కమిటీ అధ్యక్ష కార్యదర్శులు సోమయ్య బసవ పున్నయ్య తదితర రాష్ట్ర జిల్లా స్థాయి నాయకుల సూచన మేరకు జిల్లా కమిటీ సమన్వయంతో ఈ పదవుల ఎంపిక జరిగింది.

*”జర్నలిస్ట్ కెపి”కి రాష్ట్రస్థాయి పదవికి ప్రతిపాదన..*

గతంలో జిల్లా అధ్యక్షుడిగా టిడబ్ల్యూజేఎఫ్ కు సేవలు అందించిన జర్నలిస్టు ఎండి ఖాజా పాషా (కేపీ)నీ రాష్ట్ర కమిటీ గుర్తించింది. గతంలో సమర్థవంతంగా సేవలు అందించడమే కాకుండా వర్తమానంలోనూ జర్నలిస్టులందరినీ ఏకం చేసి ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చి ఇతర యూనియన్లను వైట్ వాష్ చేసిన కెపి సుమారు వందకు పైగా జర్నలిస్టులతో శుక్రవారం కందుకూరు సమావేశానికి హాజరయ్యారు. ఈ నేపద్యంలో అతడి సమర్థతను గుర్తించిన రాష్ట్ర కమిటీ రాష్ట్ర కౌన్సిల్ లో అతనికి అవకాశం కల్పిస్తూ జిల్లా సభ ఏకగ్రీవ తీర్మాన నిర్ణయం తీసుకుంది. దీని పట్ల జర్నలిస్టులు అందరూ ముక్తకంఠంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

*జిల్లా సలహాదారుగా లట్టుపల్లి మోహన్ రెడ్డి..*

షాద్ నగర్ ఆంధ్రజ్యోతి సీనియర్ విలేకరిగా మూడు దశాబ్దాల పైగా సేవలు అందిస్తున్న లట్టుపల్లి మోహన్ రెడ్డి జిల్లా సలహాదారుగా సంఘం గుర్తించింది. తన అనుభవంతో అత్యుత్తమమైన సేవలను జిల్లాకు అందించాలని కోరింది. మూడు దశాబ్దాలకు పైగా తన ప్రస్థానంలో ఎలాంటి మచ్చ లేకుండా కొనసాగుతూ, జర్నలిస్టు సంఘాలలో చురుకుగా పనిచేస్తూ జర్నలిస్టుల శ్రేయస్సు కోసం కృషి చేసిన మోహన్ రెడ్డికి ఈ గుర్తింపు లభించడం పట్ల స్థానిక జర్నలిస్టులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

*జిల్లా ఉపాధ్యక్షుడిగా భవాని వేణుగోపాల్..*

కొత్తూరు మండల ఆంధ్రజ్యోతి విలేఖరిగా మూడు దశాబ్దాలకు పైగా పని చేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ భవాని వేణుగోపాల్ కు జిల్లా ఉపాధ్యక్షులు పదవి దక్కింది. భవాని వేణుగోపాల్ అత్యంత సీనియర్ జర్నలిస్టులో ఒకరు మాత్రమే కాకుండా యూనియన్ లో చాలా కాలంగా సేవలు అందిస్తూ వస్తున్నాడు. నిరంతరం జర్నలిస్టులకు ఇబ్బందులు ఎదురైన వెన్నంటే ఉండే భవాని వేణు గోపాల్ ను జిల్లా కమిటీ గుర్తించడం పట్ల హర్షం వ్యక్తం అవుతుంది.

*జిల్లా సహాయ కార్యదర్శిగా మన్సూర్ అలీ ఖాన్..*

ఉర్దూ పత్రిక పాత్రికేయుడిగా పాతికేళ్లకు పైగా సేవలు అందిస్తూ వస్తున్న మన్సూర్ అలీ ఖాన్ కు జిల్లా సహాయ కార్యదర్శి పదవి దక్కింది. మైనారిటీలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయనను ఈ పదవికి ఎంపిక చేయడం జరిగింది. వివాద రహితుడైన పాత్రికేయుడుగా ఎంతో పేరు తెచ్చుకున్న మన్సూర్ అలీఖాన్ కు ఈ పదవి దక్కడం పట్ల ఉర్దూ పత్రికల పాత్రికేయులతో పాటు, స్థానిక టీయూడబ్ల్యూజేఎఫ్ పాత్రికేయులు అందరూ అభినందనలు తెలిపారు.

*జిల్లా కార్యవర్గ సభ్యుడిగా ఎం.డి వహీద్*

ఇక తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా నియోజకవర్గ తరఫున కొందూరు సీనియర్ జర్నలిస్టు ఆంధ్రప్రభ విలేఖరి ఎండి వహీద్ ను ప్రతిపాదించగా జిల్లా కమిటీ ఆమోదం తెలియజేసింది అయితే ఈ ప్రకటన త్వరలోనే వెలువడనుంది. జర్నలిజంలో ఎంతోకాలంగా విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిన జర్నలిస్టులకు పట్టం కట్టడం పట్ల జర్నలిస్టులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా త్వరలోనే ఎలక్ట్రానిక్ మీడియా కమిటీలు కూడా జిల్లా డివిజన్ స్థాయిలో జరుగుతాయని సూచనప్రాయంగా తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments