(adsbygoogle = window.adsbygoogle || []).push({});
*ఆడపిల్లలను బతకనివ్వాలి: ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ*
నేటి సత్యం వలపర్తి సెప్టెంబర్ నేటి సత్యం వలపర్తి సెప్టెంబర్ 28
సమాజంలో ఆడపిల్లలను, బతకనిచ్చి ఎదగనివ్వాలని ఎన్ ఎఫ్ ఐడబ్ల్యు జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి, గౌరవ అధ్యక్షురాలు కళావతమ్మ పిలుపునిచ్చారు. వనపర్తి సిపిఐ ఆఫీస్, అంబేద్కర్ చౌక్ లోNFIW ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. బతుకమ్మలను తలపై పెట్టుకుని ఆఫీస్ నుంచి ఊరేగింపుగా అంబేద్కర్ చౌక్ కు చేరుకొని సుమారు నాలుగు గంటల పాటు బొడ్డెమ్మలు కొట్టి ఆటలు ఆడి పాటలు పాడారు. ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. ఆడపిల్లను బతకని ఇవ్వాలని ఉయ్యాలో”అంటూ పాడి ఆకట్టుకున్నారు. నేతలు మాట్లాడుతూ.. సమాజం ఆడపిల్లను చిన్నచూపు చూస్తున్నారు అన్నారు. ఆడపిల్ల పుడితే తల్లిదండ్రి కూడా భారంగా భావిస్తున్నారని, చదివి ఎదిగితే తమకు ఫ్రెండ్ కి కష్టం అవుతుందని మధ్యలోనే ఆపేస్తున్నారన్నారు. ఆడపిల్లలు మగపిల్లలు సమానమని భావన పెరగాలన్నారు. ఆడపిల్ల గడప దాటితే పాడవుతుందనే దురభిప్రాయం పోవాలన్నారు. చేయూతనిస్తే ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారని తల్లితండ్రులను కూడా వృద్ధాప్యంలో పోషిస్తున్నారని గుర్తు చేశారు. అయితే ఆడపిల్ల బయటకు వెళ్తే క్షేమంగా ఇంటికి చేరుతుందని పరిస్థితి ఇప్పటికీ లేదన్నారు, అత్యాచారాలు హత్యలు దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. రచ్చని కల్పించాల్సిన బాధ్యత పాలకులతో పాటు సమాజానికి ఉందన్నారు. ఆడపిల్లను కడుపులోనే చంపేయడంతో పురుషులతో పోలిస్తే మహిళ సంఖ్య తగ్గిందని, ఆడపిల్లలు తగ్గిన కారణాలు మగ పిల్లలకు పెళ్లిళ్లు కావటం లేదన్నారు. ప్రభుత్వం బతుకమ్మ సంబరాలతోని సరిపెట్టడం సరికాదని, అడుగడుగునా ఆడపిల్లకు సమాజంలో రక్షణ గౌరవం కల్పించాలన్నారు. ఆడపిల్లలు ధైర్యంగా సమాజంలో ఎదిగేందుకు సిద్ధం కావాలన్నారు. ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ జిల్లా గౌరవ అధ్యక్షురాలు కళావతమ్మ, పట్టణ కన్వీనర్ జయమ్మ, కో కన్వీనర్ శిరీష, నేతలు వెంకటమ్మ శంకరమ్మ శ్రీదేవి జ్యోతి జయశ్రీ సుమిత్ర సుప్రియ కురుమమ్మ, సిపిఐ ఏఐటీయూసీ నేతలు రమేష్ శ్రీరామ్ గోపాలకృష్ణ వంకా గోపాల్ వంశీ ప్రజానాట్యమండలి కళాకారులు పాల్గొన్నా
రు.