Neti Satyam
Newspaper Banner
Date of Publish : 30 September 2025, 4:02 am Editor : Admin

రంగారెడ్డి జిల్లాలో రెండు విడతల్లో స్థానిక ఎన్నికలు!!




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం సెప్టెంబర్ 30

*రంగారెడ్డి జిల్లాలో రెండు విడతలలో స్థానిక ఎన్నికలు.*

*స్థానిక సంస్థల నిర్వహణపై ఆర్డీఓలు,ఎంపీడీఓలు,ఎంపీఓలతో జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్.!*

స్థానిక ఎన్నిలకలను ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరిస్తూ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సూచించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరం నుండి ఆర్డీఓలు, ఎంపీడీఓలు, ఎంపీఓలతో జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు జారీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,,,రంగారెడ్డి జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను, సర్పంచ్ ఎన్నికలను రెండు విడుతలలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అక్టోబర్ 9 వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందని, అక్టోబర్ 9 నుంచి 11 వరకు ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, అక్టోబర్ 23న ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలి విడత పోలింగ్,అక్టోబర్ 13 నుంచి15 వరకు ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, అక్టోబర్ 27న ఎంపీటీసీ, జడ్పీటీసీ రెండో విడత పోలింగ్ ఉంటుందని తెలిపారు.అక్టోబర్ 17న సర్పంచ్ ఎన్నికలకు తొలి విడత నోటిఫికేషన్ జారీ, అక్టోబర్ 17 నుంచి 19 వరకు ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, 31న సర్పంచ్ ఎన్నికలకు తొలి విడత పోలింగ్, అక్టోబర్ 21 నుంచి 23 వరకు ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, నవంబర్ 4 న సర్పంచ్ ఎన్నికలకు రెండో విడత పోలింగ్ ఉంటుందని తెలిపారు.స్థానిక ఎన్నికల నిర్వహణలో భాగంగ జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని, ఎం.సి.సి. నియమావళిని పక్కగా అమలు చేయాలని సూచించారు. ఎన్నికల విధులలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన విధులను నిర్వర్తించాలని ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, నోడల్ అధికారులు, ఆర్డీఓలు, ఎంపీడీఓలు, ఎంపీఓలు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.. KP