నేటి సత్యం
*దసరా కానుక.. సమాజ సేవకులు కనుక..*
*పారిశుద్ధ కార్మికులకు రూ.2 వేలు ఎమ్మెల్యే నజరానా..*
*షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఔదార్యం..*
*సొంత ఖర్చుతో నగదు చెల్లింపు..*
*పారిశుద్ధ్య కార్మికుల కృతజ్ఞతాభివందనం*
నేటి సత్యం షాద్నగర్ సెప్టెంబర్ 30
నిత్యం వీధుల్లోకి బయలుదేరి.. తెల్లవారేసరికి దుర్గంధ నిర్మూలన కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే సమాజ సేవకులు పారిశుద్ధ్య కార్మికులు.. అలాంటి పారిశుధ్య కార్మికులకు నిరంతరం అండగా ఉండే షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మరోసారి ఔదార్యాన్ని ప్రదర్శించారు. ప్రబాలిక పరిధిలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులందరికీ రూ.2 వేల చొప్పున ఒక్కొక్కరికి దసరా నజ్రానాలు సొంతంగా అందించారు. మంగళవారం పట్టణ మున్సిపాలిటీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. 140 మంది కార్మికులందరికీ కలిపి మొత్తంగా రూ.2.80 లక్షలు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికులు లేకపోతే ఆరోగ్యం అగాధంలో పడుతుందని ఆయన అన్నారు. కరోనా సమయంలో వాళ్లు గనక లేకపోతే ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోయి ఉండేవని పేర్కొన్నారు. అలాంటి కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని ఆయన స్పష్టం చేశారు. పురపాలిక కమిషనర్ సునీత, కాంగ్రెస్ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు..