(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం నగర్ కర్నూల్ సెప్టెంబర్ 30
*స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి ,సిపిఐ పార్టీ శ్రేణులకు పిలుపు*
*ఎం బాల నరసింహ సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు*
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ లక్ష్మణ చారి భవన్ లో సిపిఐ జిల్లా కౌన్సిల్ సమావేశం టి నరసింహ అధ్యక్షతన జరిగింది,
సిపిఐ జిల్లా కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎం బాల నరసింహ సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, ఎస్ఎండి ఫయాజ్ సిపిఐ జిల్లా నాగర్కర్నూల్ కార్యదర్శి, పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాంఘిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిపిఐ పార్టీ సిద్ధంగా ఉందని ఏం బాల నరసింహ ఆయన అన్నారు,
నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా సిపిఐ పార్టీ మండల పరిషత్ జిల్లా పరిషత్, గ్రామపంచాయతీ, వార్డు మెంబర్లు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు,
సిపిఐ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అదేవిధంగా సిపిఐ పార్టీనీ గెలిపిస్తే బడుగు బలహీన వర్గాల పక్షాన నిరుపేదలు, ఇల్లు లేని వారికి ఇండ్లు ఇప్పించడం, జాగ లేని వారికి జాగాలు ఇప్పించడం, గ్రామాలలో అవినీతి జరగకుండా అభివృద్ధి వైపు అడుగులు వేస్తామని తాగునీరు సాగునీరు, అందించే విధంగా ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి రైతుల పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి రైతుల పక్షాన వేసవిల పక్షాన నిలబడి పోరాటాలు చేసి న్యాయం చేస్తామని అదే విధంగా గ్రామాలలో ఎలాంటి అవినీతి జరగకుండా అరికట్టామని అందుకే సిపిఐ పార్టీని గెలిపించి ఆదరించండి,
సిబిఐ పార్టీ నిరంతరం ప్రజల కోసం, విద్యార్థిని విద్యార్థుల కోసం, యువజనల కోసం, మహిళ లల హక్కుల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటున్నాం, అందుకు సిపిఐ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలలో సిపిఐ పార్టీ అభ్యర్థులను గెలిపించి ఆదరించండి,
ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యుడు హెచ్ ఆనంద్ జి, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కేశవ గౌడ్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు టి నరసింహ, పెబ్బేటి విజయుడు, ఈర్ల చంద్రమౌళి, కోళ్ల యేసయ్య, ఆర్ ఇందిరమ్మ, కొమ్ము భరత్, సిపిఐ జిల్లా కౌన్సిల్ సూర్య శంకర్ గౌడ్, మర్యాద వెంకటయ్య, బుల్లెద్దుల శ్రీనివాసులు, పి కృష్ణ జి, వి రవీందర్, ఎస్కే కాజా మహిముద్దీన్, తుమ్మల శివుడు, తప్పెట కిరణ్ కుమార్, జి కురుమయ్య, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు, కందూరి వెంకటమ్మ, సిపిఐ ప్రజాసంఘాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, మారేడు శివశంకర్, బండి లక్ష్మీపతి, మధు గౌడ్ , నరేష్, ప్రేమ్ కుమార్, డి ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు,