Neti Satyam
Newspaper Banner
Date of Publish : 04 October 2025, 1:37 pm Editor : Admin

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి సత్తా చాటాలి తిప్పర్తి నికేష్




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి సత్తా చాటాలి

  • -గన్నేరువరం మండలంలో కాషాయ జెండా రెపరెపలాడించాలి

-గన్నేరువరం మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేష్

 

నేటి సత్యం న్యూస్: గన్నేరువరం, అక్టోబర్ 4 (రమేష్ రిపోర్టర్ ):-

కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేష్ ఆధ్వర్యంలో బిజెపి ముఖ్య నేతలు సమావేశం నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ ప్రజల్లోకి వెళ్ళండి నేటి కాంగ్రెస్ సర్కార్ మోసం, నాటి టిఆర్ఎస్ సర్కార్ దోపిడి పై గళమెత్తండి.

గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ మోది ప్రభుత్వం చేస్తున్నవే

కాంగ్రెస్, బి ఆర్ ఎస్ లను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు.

స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని, ఆరు గ్యారెంటీలతో, 420 హామీలతో ప్రజలను మోసం చేసిన నేటి కాంగ్రెస్ ప్రభుత్వ తీరును, అధికారంలో ఉండి అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచుకున్న బి ఆర్ ఎస్ వ్యవహారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. గన్నేరువరం మండలం అధ్యక్షుడు తిప్పర్తి నికేష్ అధ్యక్షతన శనివారం రోజున స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీ ముఖ్య నేతలు, ఎంపిటిసి, జెడ్పిటిసి ఆశావాహు లతో సమావేశం నిర్వహించారు. ఇట్టి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన గంగాడి కృష్ణారెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల పై పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేసి మాట్లాడారు. దేశాన్ని 60 ఏళ్లు ఏలిన కాంగ్రెస్ పార్టీ గ్రామాల అభివృద్ధి కోసం చేసిందేమిలేదని విమర్శించారు. 2014లో అధికారంలోకి వచ్చిన బిజెపి మోడీ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి , ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. నేడు గ్రామపంచాయతీలో జరుగుతున్న ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలన్నీ మోది ప్రభుత్వమే చేస్తున్నవేనన్నారు. గ్రామ పాలన వ్యవస్థ కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తంగా మారిందన్నారు. గ్రామాల్లో సమస్యలు రాజ్యమేలుతున్న అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల సమయం కావస్తున్న పంచాయతీలకు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం భయపడుతుందన్నారు. ఎందుకంటే 6 గ్యారంటీలు, లెక్కలేని హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ కు స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలనే ఆలోచనలో ప్రజలందరూ ఉన్నారని తెలిపారు. గత బిఆర్ఎస్ , నేటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తీరు ప్రజలకు అర్థమైందని , ఆ రెండు పార్టీల పై ప్రజానీకానికి విశ్వాసం లేదని, ఎవరు ఆ పార్టీలను నమ్మేస్థితిలో లేరని తెలిపారు. దేశప్రజలంతా బిజెపి నరేంద్ర మోది నాయకత్వంపై నమ్మకం , విశ్వాసంతో ఉన్నారని తెలిపారు. తెలంగాణలో కూడా ప్రజలంతా బిజెపి వైపు చూస్తున్నారన్నారు. ఘత ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే ఎందుకు నిదర్శనమన్నారు. ప్రజలు బిజెపిపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా, జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి సత్తా చాటి చెప్పడానికి పార్టీ శ్రేణులంతా తగిన కృషి చేయలన్నారు. జరగబోయే జడ్పిటిసి, ఎంపిటిసి, సర్పంచ్ ఎన్నికల సమరంలో కాషాయ జెండా రెపరెపలాడించడానికి తగిన కార్యచరణతో ముందు కొనసాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు సాయిని మల్లేశం,ఏలేటి చంద్రారెడ్డి,సొల్లు అజయ్ వర్మ, విలాసాగరం రామచంద్రం, ముత్యాల జగన్ రెడ్డి,గుంటుక శంకర్,మచ్చ బాలరాజ్, పుల్లల రాము, కూర హరీష్, అనంతరెడ్డి, బలరాం రెడ్డి, చెక్కిల చంద్రయ్య, పంపాలి రాజశేఖర్,జాడిగా పువ్వు వినయ్,కాంతాల శ్రీనివాస్ రెడ్డి, మునిగంటి లింగయ్య, నరసింహస్వామి, భూమాడు సురేందర్, గట్టు కిషన్, నందికొండ సురేందర్ రెడ్డి,గూడూరు జగన్,చుక్క లక్ష్మయ్య, బండి గంగయ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.