సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై కోర్టులో దాడిని ఖండిస్తున్నాం.. టి రామకృష్ణ
సిపిఐ . రాష్ట్ర సమితి సభ్యులు
భారతదేశపు న్యాయవ్యవస్థలో అత్యున్నత పదవి అయినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయి ఒక లాయర్ చెప్పుతో దాడి చేయడానికి ప్రయత్నించడం చాలా దారుణం. దీనిపై టి రామకృష్ణ స్పందిస్తూ అట్టడుగు వర్గాల ప్రజలు,వ్యక్తి ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్న కుల వివక్షత వెంటాడుతూ ఉంటుంది అనటానికి ఈరోజు సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి గవాయిపై ఒక లాయర్ ప్రత్యక్షంగా తన చెప్పుతో దాడి చేయాలని ప్రయత్నించటం అనాగరికత,చదువుకున్న నిరక్షరాస్యుడు ఇంతటి అఘాయిత్యానికి పాల్పడటం దుర్మార్గం.దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడి రాజ్యాంగం మీద,భారత పార్లమెంట్ మీద,భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు మీద,ప్రజాస్వామ్యం మీద దాడిగా పరిగణించి,ఆ లాయర్ పై దేశద్రోహం కేసు పెట్టాలి డిమాండ్ చేస్తునo
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలి, ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే ఇలా జరిగితే,సాధారణ పౌరుల పరిస్థితి ఏంటని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు