Neti Satyam
Newspaper Banner
Date of Publish : 06 October 2025, 2:38 pm Editor : Admin

మానేరు నదిపై హై లెవెల్ బ్రిడ్జి స్థలం పరిశీలన!!




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం అక్టోబర్ 6

మానేరు నదిపై హై లెవెల్ బ్రిడ్జి కొరకు స్థల పరిశీలన

నేటి సత్యం న్యూస్: గన్నేరువరం, అక్టోబర్ 7 (రమేష్ రిపోర్టర్)

 

కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని యాస్వాడ,మైలారం గ్రామాలలోని హై లెవెల్ బ్రిడ్జి కొరకు స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో మానేరు నది పై వంతెన ఇటీవల 77 కోట్ల తో మంజూరైనటువంటి చొక్కరావుపల్లి గ్రామం నుండి కాకుండా గన్నేరువరం,యస్వాడ మీదుగా లేదంట్టె మైలారం మీదుగా బ్రిడ్జి వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ బ్రిడ్జి వేయడం వల్ల కరీంనగర్ అతి తక్కువ దూరం ఉంటది. మూడు మండలాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికలు కోడు ము గుయగానే ఇంజనీర్లు వచ్చి స్థల పరిశీలన చేస్తారు. అలాగే ఎక్కడైతే డెప్త్ తక్కువగా ఉంటుందో అంచనా వేస్తారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రిడ్జి జేఏసీ నాయకులు సంపత్ ఉదయ్ కుమార్, పుల్లెల జగన్ కాంగ్రెస్ నాయకులు ఉపేందర్ రెడ్డి, కొమ్మెర రవీందర్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి,అల్వాల కోటి, సిపి ఎంఎల్ నాయకులు రణం రవన్న, మాతంగి అనిల్ తదితరులు పాల్గొన్నారు.