సనాతన ఉన్మాదo.. నెత్తికి ఎక్కుతే ??
** ‘సనాతన’ ఉన్మాదం Oct 8,2025 05:55 నేటి సత్యం RK దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పై సనాతనధర్మోన్మాదం తలకెక్కించుకున్న న్యాయవాది బూటు విసిరి దాడికి యత్నించిన అత్యంత ఆందోళనకర ఘటన ప్రస్తుతం దేశంలో నెలకొన్న దుస్థితిని తెలుపుతుంది. సోమవారం అత్యున్నత న్యాయస్థానంలో, అదీ ఒక కేసు విచారణ సందర్భంగా వాదనలు జరుగుతుండగా దుండగ మనస్తత్వం నిలువెల్లా నింపుకున్న ఒక లాయర్ ఎలాంటి జంకు భయం లేకుండా...