(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం శంషాబాద్
*లాహిరి లాహిరిలో ఊగుతున్న బాల యేసు కాలనీ, మామిడి పల్లి రోడ్డు!*
*శంషాబాద్ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం ప్రజల్లో ఆగ్రహం*
*విద్యార్థుల ప్రాణాలు ప్రమాదంలో – తక్షణ చర్య కోరుతున్న తల్లిదండ్రులు*
*“ఇకనైనా మేల్కొని రోడ్డు బాగు చేయండి మున్సిపల్ అధికారులూ!”*
శంషాబాద్, అక్టోబర్ 7
, 2025: “ఓ ఓ జగమే ఊయల!” అన్న పాటకు తగ్గట్టుగా మారింది శంషాబాద్ మున్సిపాలిటీలోని మామిడిపల్లి బాల యేసు కాలనీ రోడ్డు. వర్షాలు కురిసినప్పుడల్లా గుంతలతో నిండిపోయి, ఈ రోడ్డు ప్రమాదకరంగా మారుతోంది. ఆటోలు, బైకులు, చిన్న వాహనాలు రోజూ ఇక్కడ స్తంభించి, ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రజలు ఎన్నోసార్లు శంషాబాద్ మున్సిపల్ అధికారులకు, ఏరియా సూపర్‌వైజర్‌కు ఈ సమస్యను తెలియజేసినప్పటికీ, ఎలాంటి స్పందన లేకపోవడం ఆవేదన కలిగిస్తోంది. రోడ్డు మరమ్మతు పనులు చేపట్టకపోవడంతో, కాలనీలోని విద్యార్థులు పాఠశాలలకు వెళ్లే ఆటోలు, బస్సులు ప్రతిరోజూ ప్రమాదాల అంచున ఉన్నాయి. తల్లిదండ్రుల ఆందోళన: “ఈ రోడ్డు పరిస్థితి ఇలాగే కొనసాగితే, ఎప్పుడో ఒకప్పుడు పెద్ద ప్రమాదం జరిగే ప్రమాదం ఉంది. మా పిల్లల ప్రాణాలకు ముప్పు వాటిల్లకముందే అధికారులు చర్యలు తీసుకోవాలి,” అని స్థానిక తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల డిమాండ్: మున్సిపల్ అధికారులు వెంటనే రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి, ప్రజల ప్రాణాలను కాపాడాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. “ఇకనైనా మేల్కొనండి, మా బతుకులు బాగు చేయండి!” అని వారు ఘాటుగా అంటున్నారు.మున్సిపల్ అధికారులు ఈ విషయంలో ఎప్పుడు స్పందిస్తారో, లేక ఈ గుంతల రోడ్డు మరో ప్రమాదానికి దారితీస్తుందో చూడాలి!