Neti Satyam
Newspaper Banner
Date of Publish : 07 October 2025, 7:32 am Editor : Admin

న్యాయమూర్తి గవాయిపై దాడికి నిరసనగా న్యాయవాదుల విధుల బహిష్కరణ!!




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

న్యాయమూర్తి” గవాయి” పై దాడి కి నిరసన గా న్యాయవాదుల విధుల బహిష్కరణ…..

కొల్లాపూర్ అక్టోబర్ 7 ( నేటి సత్యం ప్రతినిధి: యస్.పి. మల్లికార్జున సాగర్)

సుప్రీంకోర్టు కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్. గవాయి పై జరిగిన దాడి కి నిరసన గా కొల్లాపూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యం లో కొల్లాపూర్ మున్సిప్ కోర్టు ఆవరణ లో న్యాయవాదులు మంగళ వారం కోర్టు విధులను బహిష్కరించారు.

ఈ సందర్భం గా కొల్లాపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పి. నాగరాజు, ఉపాధ్యక్షులు ఎన్. నిరంజన్ మాట్లాడుతూ ప్రధాన న్యాయమూర్తి పై జరిగిన దాడి ని ఖండించారు.

ఇలాంటి ఘటన లు పునరావృతం కాకుండా చూసే బాధ్యత ప్రభుత్వం మరీయు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పైన ఉందని వారన్నారు.

ఈ కార్యక్రమం లో సీనియర్ న్యాయవాదులు, వలపే శ్రీనివాసరావు, భాస్కర్ రెడ్డి , వసంత రెడ్డి , శ్రీహరి , బాలస్వామి, మనోహర్, నిరంజన్ , ఆర్. కురుమూర్తి , జేసి కురిమయ్య, రాఘవేంద్ర , మధుసూదన్ రావు , మనోహర్ , నజీరుద్దిన్, రామ లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.