నేటి సత్యం నాగర్ కర్నూల్ 
పాలస్తీనా ప్రజలకు మద్దతుగా ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన.
ఏఐవైఎఫ్ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు
దేశామోని ఆంజనేయులు
బీజ్జ శ్రీనివాసులు
నేటి సత్యం. నాగర్ కర్నూల్ అక్టోబర్ 8
గాజాపై జరుగుతున్న మారణకాండని ఇజ్రాయిల్ ఆపాలని దానికి సహకరిస్తున్న అమెరికా సామ్రాజ్యవాదం నశించాలని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో పాలస్తినా ప్రజలకు మద్దతుగా ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ ఆర్టీసీ బస్ స్టాప్ దగ్గర నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది అధ్యక్ష కార్యదర్శులు దేశామోని ఆంజనేయులు బీజ్జ శ్రీనివాసులు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించి నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. గత రెండు సంవత్సరాలుగా ఇజ్రాయిల్ పాలస్తిన ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని దురుద్దేశంతో యుద్ధ వాతావరణం నెలకొల్పి ఐక్యరాజ్యసమితి మిగతా దేశాలు వ్యతిరేకించిన ఇజ్రాయిల్ మాత్రం చిన్న పిల్లలను ఆడవాళ్లను ముసలి వాళ్ళను అని చూడకుండా దాదాపు 70 వేల మందిని చంపింది ఇతర దేశాలు ఇస్తున్న ఆహార పదార్థాలు వస్తువులు పాలిస్తే నాకు చేరకుండా అడ్డుకుంటుంది కావున ఇజ్రాయిల్ చేస్తున్న మారన కాండం ఆపాలని అదేవిధంగా మోడీ మౌనం వీడాలని, పాలస్తీనాకు సంఘీభావం తెలిపాలనీ, యుద్ధం ఆపే విధంగా ప్రయత్నాలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు కేసుముల్లా శివకృష్ణ డిహెచ్పిఎస్ అధ్యక్ష కార్యదర్శులు కొమ్ము భరత్ బండి లక్ష్మీపతి ఏఐటీయూసీ మారేడు శివశంకర్ పెరుమల గోపాల్ రాముడు కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు