Neti Satyam
Newspaper Banner
Date of Publish : 07 October 2025, 12:34 pm Editor : Admin

మత ఉన్మధ విష సంస్కృతి వల్లే భౌతిక దాడులు జరుగుతున్నాయి డి హెచ్ పి ఎస్.!!




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం నాగర్ కర్నూల్

*మత ఉన్మాద విష సంస్కృతి వల్లే ఈ భౌతిక దాడులు జరుగుతున్నాయి*

*సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ*

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో

*దళిత హక్కుల పోరాట సమితి* (DHPS) నాగర్ కర్నూల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో *సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి పై దాడి ప్రయత్నానికి* వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏం బాల నరసింహ గారు మాట్లాడుతూ దేశ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినా జస్టిస్ బి ఆర్ గవాయ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ యావత్ దేశం తలదించుకునే నీచమైన చర్యగా ఆయన అభివర్ణించారు దేశంలో అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిలో ఉన్నటువంటి వ్యక్తికే నేడు రక్షణ లేకుండా పోయిందని దీని అంతటికి కారణం బిజెపి మరియు ఆర్ఎస్ఎస్ దాని పరివార్ శక్తులు నిత్యం దేశంలో అసత్యాలను ప్రచారం చేస్తూ, సనాతన ధర్మాన్ని అనుసరించాలని లేనియెడల ఎంతటి హోదాలో ఉన్న వ్యక్తుల పైన కూడా దాడి చేయడానికి వెనకాడబోమని ఈ సందర్భం మనకు తెలియజేస్తుంది. ఈ దాడికి ప్రధాన కారణం జస్టిస్ బి ఆర్ గవాయి గారు అంబేద్కర్ వాది కావడమే, రాజ్యాంగ రక్షణ కోసం నిరంతరం కృషి చేయడమే.సనాతన ధర్మం ఒక దళితుడు అత్యున్నత పదవిలో ఉండడం ఒప్పుకోదు అంతర్జాతీయ తీవ్రవాదులు దేశంపై దాడి చేస్తే సనాతనవాదులు సుప్రీంకోర్టు పై దాడి చేస్తున్నారని ఇలాంటి ఘటనలు భారత రాజ్యాంగానికి లౌకిక వాదానికి భారతదేశానికి చాలా ప్రమాదమని దేశ ప్రధానికి వ్యతిరేకంగా మాట్లాడితే దేశ ద్రోహం కింద అరెస్ట్ చేస్తున్న నేటి పాలకులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన దాడి జరిగితే ఆ వ్యక్తిని అరెస్టు చేయకుండా వదిలివేయడం హేయమైన చర్య అని సుప్రీమ్ కోర్టు పై తీవ్రవాద దాడిగా పరిగణించి దేశద్రోహం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఇలాంటి ఘటనలు దేశంలో ఎక్కడ జరగకుండా కాపాడాల్సిన బాధ్యత పాలకులపై ఉందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొమ్ము భరత్, బండి లక్ష్మీపతి , డిహెచ్పిఎస్ జిల్లా నాయకులు పెరుముల గోపాల్, శివశంకర్, బిజ్జ శ్రీను, అంజి ,శివకృష్ణ, బాలయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు