(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం
*
పొన్నం ప్రభాకర్ వెంటనే క్షమాపణలు చెప్పాలి.*
పొన్నం మౌనం వహిస్తే అణగారిన వర్గాల ఐక్యతకు భంగం కలుగుతుంది.*
*ఎమ్మార్పీఎస్ కొందుర్గ్ మండల అధ్యక్షులు ఆనేగాళ్ళ ఆనంద్ మాదిగ*
వివరణ :- మాదిగ సామాజిక వర్గానికి చెందిన మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారిని అవమానించేలా వ్యాఖ్యలు చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు తక్షణమే క్షమాపణలు చెప్పాలని
ఎమ్మార్పీఎస్ కొందుర్గ్ మండల అధ్యక్షులు ఆనేగాళ్ళ ఆనంద్ మాదిగ గారు డిమాండ్ చేశారు.
బీసీ సామాజిక వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్ మాదిగ సామాజిక వర్గానికి చెందిన కట్లూర్ లక్ష్మణ్ ఉద్దేశించి దున్నపోతు అనే మాటను ఉపయోగించి మాట్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
ఇలాంటి అహంపూరిత వ్యాఖ్యల వల్ల దళితులు , బలహీన వర్గాల మధ్య దూరం పెరుగుతుందని అన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకొని జరిగిన తప్పును సరిసిద్దుకునే విధంగా వెంటనే
పొన్నం ప్రభాకర్ గారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం
*పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం*
ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ , మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారిని ఉద్దేశించి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు దున్నపోతు అని సంబోధించి అవమానించడాన్ని నిరసిస్తూ మాదిగ జాతి చేస్తున్నటువంటి ఆత్మగౌరవ పోరాటాన్ని ముందుకు తీసుకు వెళ్తాము
మన మధ్య అభిప్రాయ బేధాలు ఉన్నప్పటికీ ఆత్మగౌరవ విషయంలో జాతి మొత్తం ఒక త్రాటిపై నిలబడాలని కోరారు.
పొన్నం ప్రభాకర్ గారు క్షమాపణలు చెప్పేంతవరకు ఉద్యమం ఆపేది లేదని స్పష్టం చేశారు.
*ఆకలినైన భరిస్తాం కానీ అవమానాన్ని భరించలేము*
*ఎమ్మార్పీఎస్ కొందుర్గ్ మండల అధ్యక్షులు ఆనేగాళ్ళ ఆనంద్ మాదిగ*