(adsbygoogle = window.adsbygoogle || []).push({});
*నాగర్ కర్నూల్ జిల్లా….*
నేటి సత్యం 
*మైనర్ వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు*
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీలోని సాయి నగర్ కాలనీలో జరుగుతున్న మైనర్ బాలిక వివాహాన్ని పోలీసులు అడ్డుకున్నారు. సీడబ్ల్యూసీ (CWC) సభ్యుల సమాచారంతో, అచ్చంపేట ఎస్సై ఇందిర, షీ టీం బృందాలు అక్కడకు చేరుకున్నారు. బాల్య వివాహం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించి, కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. బాలిక భవిష్యత్తు దృష్ట్యా ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.